SS Rajamouli: డ్యుయల్ రోల్‍లో దర్శక ధీరుడు రాజమౌళి! స్టైలిష్‍గా..
SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా డ్యుయల్ రోల్‍లో కనిపించారు. ఇందుకు సంబంధించిన క్లిప్ వైరల్‍గా మారింది.
SS Rajamouli: సాధారణంగా నటీనటులు, క్రీడాకారులు ఎక్కువగా ఫేమస్ బ్రాండ్‍లకు ప్రచారకర్తలుగా ఉంటారు. బ్రాండ్ అంబాసిడర్లుగా అడ్వర్టజ్‍మెంట్లు (యాడ్స్) చేస్తుంటారు. అయితే, ప్రముఖ బ్రాండ్‍లకు అంబాసిడర్లుగా సినీ డైరెక్టర్లు ఉండడం చాలా అరుదు. అయితే, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి మాత్రం సినీ ఇండస్ట్రీలో ఎవరికీ లేనంత క్రేజ్ ఉంది. హీరోలను మించిన పాపులారిటీ ఆయనది. దేశమంతా ఎనలేని పేరు ఉంది. దీంతో ఓ ప్రముఖ బ్రాండ్‍కు అంబాసిడార్‌గా మారాడు రాజమౌళి. యాడ్ షూట్ చేశాడు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పోకు బ్రాండ్ అంబాసిడార్ అయ్యాడు రాజమౌళి. ఆ కంపెనీ కోసం ఓ యాడ్ కూడా చేశాడు. ఈ యాడ్‍కు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను ఒప్పో వెల్లడించింది. దీంట్లో రాజమౌళి డ్యుయల్ రోల్‍లో కనిపించాడు. స్క్రీన్‍పై రెండు పాత్రలుగా కనిపించాడు. అలాగే సూట్ ధరించి ఎంతో స్టైలిష్‍గా, హ్యాండ్‍సమ్‍గా ఉన్నాడు రాజమౌళి. ఒప్పో తీసుకురానున్న కొత్త ఫోన్ కోసం ఈ యాడ్ చేసినట్టు కనిపిస్తోంది. త్వరలోనే పూర్తి అడ్వర్టజ్‍మెంట్ రావొచ్చు. రాజమౌళి డ్యుయల్ రోల్‍లో ఉన్న ఈ క్లిప్ వైరల్‍గా మారింది.
దర్శకుడు రాజమౌళి ఖ్యాతి భారదేశాన్ని దాటి ప్రపంచస్థాయికి చేరింది. బాహుబలి సినిమాలతో భారత సినీ పరిశ్రమలో చరిత్రను తిరగరాసి.. అనేక అత్యున్నత రికార్డులను జక్కన్న సాధించాడు. దేశంలోనే టాప్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఇక ఆర్‍ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయికి చేరాడు. మూవీని ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. హాలీవుడ్‍లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా పేరు మార్మోగిపోయింది. చాలా దేశాల్లో ఆర్ఆర్ఆర్ విపరీతంగా క్రేజ్ సాధించింది.
రాజమౌళి తదుపరి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబల్ రేంజ్‍లో మూవీ తీయనున్నాడు. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని ఇటీవలే రాజమౌళి పేర్కొన్నాడు. మహేశ్‍తో తన సినిమా ఇండియానా జోన్స్ రేంజ్‍లో ఉంటుందని స్పష్టం చేశాడు. అలాగే, ఈ సినిమా స్క్రీప్ట్‌ను జూలై కల్లా పూర్తి చేసి, రాజమౌళికి ఇస్తానని అతడి తండ్రి, ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు. రాజమౌళి - మహేశ్ మూవీ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.