Satya Movie: తమిళ హిట్ మూవీకి రీమెక్‌గా సత్య.. హీరో ధనుష్‌లా ఉంటాడనడంతో!-producer siva mallala comments on satya movie and compares hamaresh with dhanush ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satya Movie: తమిళ హిట్ మూవీకి రీమెక్‌గా సత్య.. హీరో ధనుష్‌లా ఉంటాడనడంతో!

Satya Movie: తమిళ హిట్ మూవీకి రీమెక్‌గా సత్య.. హీరో ధనుష్‌లా ఉంటాడనడంతో!

Sanjiv Kumar HT Telugu
May 10, 2024 12:14 PM IST

Producer Siva Mallala About Satya Movie: తమిళ సూపర్ హిట్ మూవీ రంగోలికి తెలుగు రీమెక్‌గా వస్తున్న చిత్రం సత్య. ఈ సినిమా గురించి, ఇందులోని హీరో గురించి నిర్మాత శివ మల్లాల ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తమిళ హిట్ మూవీకి రీమెక్‌గా సత్య.. హీరో ధనుష్‌లా ఉంటాడనడంతో!
తమిళ హిట్ మూవీకి రీమెక్‌గా సత్య.. హీరో ధనుష్‌లా ఉంటాడనడంతో!

Producer Siva Mallala About Satya Movie: తమిళంలో హిట్ కొట్టిన రంగోలి మూవీ తెలుగులో మే 10న సత్య టైటిల్‌తో విడుదల కాబోతోంది. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన రంగోలి సినిమాని శివం మీడియాపై శివమల్లాల నిర్మాతగా తెలుగులో తీసుకొస్తున్నారు. ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత శివ మల్లాల ఆసక్తికర విశేశాలు చెప్పారు.

ఈ సినిమా ఎలా ప్రారంభమైంది?

నేను చెన్నై వెళ్లినప్పుడు నా స్నేహితుడి ద్వారా సతీష్ గారు పరిచయమయ్యారు. ఆయన తమిళ్ నిర్మాత హీరో హమరేష్‌కి తండ్రి. ఆయనతో పెరిగిన స్నేహం కొద్దీ తెలుగులో మీ రివ్యూలు బాగుంటాయి అని ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ వేయించి నాకు చూపించారు. సినిమా చూసిన తర్వాత బాగా కనెక్ట్ అయ్యాను. కానీ క్లైమాక్స్ ఎక్కలేదు. దాదాపు 45 నిమిషాల పాటు డైరెక్టర్‌తో క్లైమాక్స్ గురించి వాదించాను.

సతీష్ గారికి క్లైమాక్స్ బాలేదండి సినిమా అంతా బాగుంది అని చెప్పాను. అది ఇంకా రఫ్ వెర్షన్ మాత్రమే. మళ్లీ రెండు నెలల తర్వాత కాల్ చేసి సినిమా రిలీజ్‌కి అక్కడున్న పెద్ద దర్శకులు నిర్మాతలతో మళ్లీ చూపించారు. సినిమా గురించి మాట్లాడమని నన్ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. అప్పుడే ఈ సినిమాని తెలుగులో నేను రిలీజ్ చేస్తాను అని అనౌన్స్ చేయడం జరిగింది.

అలా ఈ సినిమా నాకు ఒక బేబీ లాగా అయిపోయింది. ఈ సినిమా డబ్బింగ్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా రూ. 12 లక్షలు ఖర్చు పెట్టాం. అచ్చమైన తెలుగు సినిమా లాగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం.

ఈ డైరెక్టర్ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి?

నాకు ఈ డైరెక్టర్ ముందు నుంచి పరిచయం. వాలి డైరెక్ట్ చేసిన ఒక సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేశాను. నవీన్ చంద్ర, అమృత అయ్యర్ యాక్ట్ చేసిన మూవీ. ప్రకాష్ రాజు గారు కూడా అందులో ఒక పార్టనర్. ఒకరోజు రామాయణంలో షూట్ జరుగుతున్నప్పుడు 6 మినిట్స్ సీన్‌ని చాలా బాగా హ్యాండిల్ చేసి తీసాడు.

అది చూసిన వెంటనే అతనికి రూ. 2,000 అడ్వాన్స్ ఇచ్చి నా నెక్ట్స్ సినిమా నీతోనే అని చెప్పినప్పుడు నన్ను ఒకరు నమ్మారు అని అతని కళ్ళల్లో వచ్చిన నీళ్లు మరిచిపోలేను. మంచి పనితీరు ఉన్న దర్శకుడు వాలి. తెలుగులో నిహారిక తో ఒక సినిమా తమిళం మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాడు. మొత్తం నాలుగు ప్రాజెక్టులు హ్యాండిల్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. సినిమా పైన చాలా పాషన్ ఉన్న వ్యక్తి.

అదేవిధంగా తను కూడా డబ్బు కోసం కాకుండా శివ మల్లాల అని నాకోసం ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన సినిమా చేశాక వేరే మూవీ చేస్తానని తనకు మంచి ఆఫర్ వచ్చినా వదులుకొని నాకోసం సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాడు.

రూ. 3 వేల జీతం నుంచి ఈ స్థాయికి ఎదిగి ఇలా సినిమాపై డబ్బు పెట్టడం రిస్క్ అనిపించలేదా?

హీరో చూడడానికి ధనుష్ లాగా జీ.వి. ప్రకాష్ లాగా ఉన్నాడని అందరూ అనడం. అదేవిధంగా ఈ సినిమాని అక్కడ రెడ్ జైంట్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేయడం. అమెజాన్ వాళ్లు ఈ సినిమా రైట్స్ అడగడం. ఇప్పుడు తెలుగు రైట్స్ నా దగ్గర ఉండడం ఈ సినిమాకి ప్లస్. అదేవిధంగా పబ్లిక్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 2 మిలియన్ మంది రంగోలి 2 ఎప్పుడు అని పోస్టులు పెడుతున్నారు. అంత హైప్ ఉన్న సినిమాని తెలుగులో నేను నిర్మిస్తూ ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.

Whats_app_banner