Priyadarshi: జంధ్యాల స్టైల్ కామెడీతో ప్రియ‌ద‌ర్శి మూవీ - డిఫ‌రెంట్ టైటిల్ ఫిక్స్ - హీరోయిన్‌గా అచ్చ తెలుగ‌మ్మాయి-priyadarshi mohana krishna indraganti comedy movie titled as sarangapani jathakam tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyadarshi: జంధ్యాల స్టైల్ కామెడీతో ప్రియ‌ద‌ర్శి మూవీ - డిఫ‌రెంట్ టైటిల్ ఫిక్స్ - హీరోయిన్‌గా అచ్చ తెలుగ‌మ్మాయి

Priyadarshi: జంధ్యాల స్టైల్ కామెడీతో ప్రియ‌ద‌ర్శి మూవీ - డిఫ‌రెంట్ టైటిల్ ఫిక్స్ - హీరోయిన్‌గా అచ్చ తెలుగ‌మ్మాయి

Nelki Naresh Kumar HT Telugu
Aug 25, 2024 01:58 PM IST

Priyadarshi: ప్రియ‌ద‌ర్శి హీరోగా మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా టైటిల్‌ను ఆదివారం మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ కామెడీ మూవీకి సారంగ‌పాణి జాత‌కం అనే పేరును ఫిక్స్ చేశారు. జంధ్యాల స్టైల్‌లో ఈ కామెడీ మూవీ సాగుతుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

ప్రియ‌ద‌ర్శి
ప్రియ‌ద‌ర్శి

Priyadarshi: బ‌ల‌గం మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు ప్రియ‌ద‌ర్శి. హీరోగా ఎక్కువ‌గా కామెడీ ఎమోష‌న‌ల్ ప్ర‌ధాన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్న ప్రియ‌ద‌ర్శి మ‌రో డిఫ‌రెంట్ మూవీతో తొంద‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను మేక‌ర్స్ ఆదివారం రివీల్ చేశారు.

సారంగ‌పాణిజాత‌కం....

ఈ సినిమాకు సారంగ‌పాణి జాత‌కం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో భూత‌ద్ధంతో త‌న చేతి రేఖ‌ల‌ను చూస్తూ ప్రియ‌ద‌ర్శి సంతోష‌ప‌డుతున్న‌ట్లు ఉంది. ఫ‌న్నీగా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. సారంగ‌పాణి జాత‌కం సినిమాలో హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి రూప కడువయూర్ న‌టిస్తోంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

మూఢ‌న‌మ్మ‌కాల‌తో...

నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి క‌థ‌తో సారంగ‌పాణి జాత‌కం సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెలిపాడు.

తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య సారంగ‌పాణి అనే యువ‌కుడు ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్నాడ‌న్న‌ది కామెడీతో పాటు స‌స్పెన్స్‌, థ్రిల్లింగ్ అంశాల‌తో ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు వెల్ల‌డించాడు.

జంధ్యాల స్టైల్‌

జంధ్యాల స్టైల్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు సారంగ‌పాణి జాత‌కం మూవీ న‌వ్విస్తూనే ఉంటుంద‌ని నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ అన్నారు. 90 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ని పేర్కొన్నారు. సెప్టెంబ‌ర్ 5లోగా మిగిలిన షూటింగ్‌ను పూర్తిచేసి త్వ‌ర‌లోనే సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత పేర్కొన్నారు. జెంటిల్‌మ‌న్‌, య‌శోద‌, స‌మ్మోహ‌నం త‌ర్వాత మా బ్యాన‌ర్‌కు మ‌రో స‌క్సెస్‌ను తెచ్చిపెడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపాడు.

మూడో సినిమా...

జెంటిల్‌మ‌న్‌, స‌మ్మోహ‌నం త‌ర్వాత శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌లో మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి చేస్తోన్న మూడో సినిమా ఇది. నిర్మాత‌గా శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌కు ఇది ప‌దిహేనో సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. ఈ కామెడీ మూవీకి వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందిస్తోండ‌గా...పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు.

హీరోగా...క‌మెడియ‌న్‌గా...

గ‌త కొంత‌కాలంగా హీరోగా, క‌మెడియ‌న్‌గా బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్‌ల‌ను అందుకుంటున్నాడు ప్రియ‌ద‌ర్శి. అత‌డు హీరోగా న‌టించిన బ‌ల‌గం మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌తో విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకుంది. . కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ 30 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ్ట‌టింది. క‌మెడియ‌న్‌గా ఓ భీమ్ బుష్‌, హాయ్ నాన్న‌, ఒకే ఒక జీవితం సినిమాల‌తో న‌వ్వించాడు. మంగ‌ళ‌వారం సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో క‌నిపించాడు.

ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన డార్లింగ్ మూవీ జూలై నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మాత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది. టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ ఆక‌ట్టుకున్నా...క‌థ క‌న్ఫ్యూజింగ్‌గా ఉండ‌టంతో సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.