Sridevi birth anniversary: శ్రీదేవి నిజంగా అతిలోక సుందరే.. ఆమె జయంతి నాడు అందాల నటి అరుదైన ఫొటోలు చూస్తారా?
- Sridevi birth anniversary: అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేక అప్పుడే 8 ఏళ్లు గడిచిపోయాయి. ఇవాళ (ఆగస్ట్ 14) ఆమె 61వ జయంతి సందర్భంగా శ్రీదేవి నిజంగా ఎవర్ గ్రీన్ బ్యూటీయే అని నిరూపించే అరుదైన ఫొటోలు ఇక్కడ చూడండి.
- Sridevi birth anniversary: అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేక అప్పుడే 8 ఏళ్లు గడిచిపోయాయి. ఇవాళ (ఆగస్ట్ 14) ఆమె 61వ జయంతి సందర్భంగా శ్రీదేవి నిజంగా ఎవర్ గ్రీన్ బ్యూటీయే అని నిరూపించే అరుదైన ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 8)
Sridevi birth anniversary: శ్రీదేవి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె అనుకోని రీతిలో ఆరేళ్ల కిందట కన్నుమూసిన విషయం తెలిసిందే.
(2 / 8)
Sridevi birth anniversary: శ్రీదేవి ఆగస్ట్ 13, 1963లో శ్రీ అమ్మ యాంగర్ అయ్యపన్ గా జన్మించింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి తర్వాత ఇండియా తొలి ఫిమేల్ సూపర్ స్టార్ గా ఎదిగింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో నటించింది.
(3 / 8)
Sridevi birth anniversary: నాలుగేళ్ల వయసులోనే అంటే 1967లో తమిళ సినిమా కందన్ కరుణై మూవీలో నటించింది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత 1976లో 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.
(4 / 8)
Sridevi birth anniversary: 16 ఏళ్ల వయసు మూవీతో స్టార్ డమ్ సంపాదించిన శ్రీదేవి తర్వాత వెనుదిరిగి చూడలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, మిస్టర్ ఇండియాలాంటి సినిమాలతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
(5 / 8)
Sridevi birth anniversary: హిందీలో తొలిసారి 1979లో ఆమె పదహారేళ్ల వయసు రీమేక్ సోల్వా సావన్ తో అడుగుపెట్టింది. తర్వాత 1983లో వచ్చిన హిమ్మత్‌వాలాతో బాలీవుడ్ లోనూ శ్రీదేవి నిలదొక్కుకుంది.
(6 / 8)
Sridevi birth anniversary: కళ్లు తిప్పుకోలేని అందం, అంతకు మించిన నటన శ్రీదేవి సొంతం. అదే ఆమెను ఇండియా తొలి ఫిమేల్ సూపర్ స్టార్ చేసింది.
(7 / 8)
Sridevi birth anniversary: బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా ముంబైకే పరిమితమైంది. జాన్వీ కపూర్ జన్మించిన సమయంలో సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత 2004లో మాలిని అయ్యర్ మూవీతో మళ్లీ సినిమాల్లోకి వచ్చింది.
ఇతర గ్యాలరీలు