Prabhas Spirit: ప్రభాస్ స్పిరిట్ లో విలన్‌గా మార్వెల్ యూనివర్స్ యాక్టర్ - పాన్ వరల్డ్ మూవీగా సందీప్ వంగా ప్లాన్
Prabhas Spirit: ప్రభాస్ స్పిరిట్ మూవీలో కొరియన్ స్టార్ యాక్టర్ మా డాంగ్ సియోక్ విలన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. మార్వెల్ మూవీ ది ఎటర్నల్స్‌లో మా డాంగ్ సియోక్ ఓ సూపర్ హీరోగా కనిపించాడు.
Prabhas Spirit: ప్రభాస్, డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో రాబోతోన్న స్పిరిట్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ సినిమాలో విలన్‌గా మార్వెల్ యూనివర్స్ చెందిన యాక్టర్‌ను సందీప్ వంగా రంగంలోకి దించుతోన్నట్లు సమాచారం. స్పిరిట్ మూవీలో విలన్‌గా కొరియన్ యాక్టర్ మా డాంగ్ సియోక్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొరియన్...హాలీవుడ్ మూవీస్...
మా డాంగ్ సియోక్ పలు సౌత్ కొరియన్ మూవీస్‌తో పాటు హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. హాలీవుడ్‌లో డాంగ్ లీ పేరుతో మా డాంగ్ సియోక్ సినిమాలు చేస్తోన్నాడు. ట్రైన్ టూ బుసాన్ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌గా సినీ లవర్స్‌కు మాడాంగ్ సియోక్ సుపరిచితుడయ్యాడు. అతడు హీరోగా నటించిన కొరియన్ మూవీస్ ది రౌండప్, ది ఔట్‌లాస్, ది గ్యాంగ్‌స్టర్ ది కాప్ ది డెవిల్‌తో పాటు పలు కొరియన్ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ది ఎటర్నల్స్ మూవీలో మా డాంగ్ సియోక్ గిల్గమోష్ అనే సూపర్ హీరోగా కనిపించాడు.
స్పిరిట్‌లో విలన్...
తాజాగా ఈ కొరియన్ యాక్టర్ ప్రభాస్ స్పిరిట్ మూవీలో విలన్‌గా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తోన్నాయి. మా డాంగ్ సియోక్ వీకీపీడియాలో పేజీలో అతడు స్పిరిట్ సినిమాలో నటించబోతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌కు ధీటుగా పవర్‌ఫుల్ విలన్‌గా స్పిరిట్ మూవీలో ఈ కొరియన్ యాక్టర్ కనిపిస్తాడని అంటోన్నారు.
పాన్ వరల్డ్ మూవీ...
స్పిరిట్ మూవీని పాన్ ఇండియా గా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు సందీప్ వంగా ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. ఈ యాక్షన్ మూవీని ఇండియన్ భాషలతో పాటు కొరియన్, చైనీస్ భాషల్లోకి డబ్ చేసే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పోలీస్ ఆఫీసర్...
స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా వెల్లడించాడు. గతంలో ఎన్నడూ చూడని ప్రభాస్ ను స్పిరిట్ మూవీలో చూస్తారని, అతడి క్యారెక్టరైజేషన్, లుక్‌తో పాటు మేనరిజమ్స్ కొత్తగా ఉండబోతున్నట్లు సందీప్ వంగా తెలిపాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పిరిట్ మూవీని టీ-సిరీస్ నిర్మిస్తోంది.
కల్కి 800 కోట్లు...
ఇటీవల రిలీజైన ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ పది రోజుల్లోనే 800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మైథాలజీ కాన్సెప్ట్ యాక్షన్ అంశాలను జోడించి సూపర్ హీరో మూవీగా దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కిని తెరకెక్కించాడు. ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకోణ్ ప్రధాన పాత్రలు పోషించగా, కమల్‌హాసన్ విలన్‌గా నటించాడు. రిలీజై పది రోజులైనా బాక్సాఫీస్ వద్ద కల్కి జోరు తగ్గలేదు.ఈ సినిమా 1500 కోట్లకపైనే వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
యానిమల్ 900 కోట్లు...
మరోవైపు సందీప్ వంగా గత మూవీ యానిమల్ బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రణ్‌భీర్‌కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన హిందీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను అలరించింది. కల్కి 2898 ఏడీతో పాటు యానిమల్ సక్సెస్ నేపథ్యంలో స్పిరిట్‌పై షూటింగ్ మొదలవ్వడానికి ముందే దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇండియా లెవల్లో పేరు సంపాదించిన సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ తో మరో లెవల్ కు వెళ్లనున్నాడు. మరోవైపు హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత సలార్ తో ప్రభాస్ కు ఓ హిట్ దక్కింది. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూలు చేసింది.
మూడు సినిమాలు...
స్పిరిట్‌తో పాటు రాజాసాబ్, సలార్2తో పాటు హను రాఘవపూడితో ఓ లవ్ స్టోరీ చేస్తోన్నాడు ప్రభాస్. ఇందులో రాజా సాబ్ మూవీ ఈ ఏడాది చివరలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తోన్నాడు.