Kalki 2898 AD Collection: 12వ రోజు తగ్గిన కల్కి 2898 ఏడీ కలెక్షన్స్.. కానీ, 100 కోట్ల వైపుగా లాభాలు!
Kalki 2898 AD Worldwide Box Office Collection: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 12 రోజున కూడా కల్కి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇలా ఇప్పటివరకు రూ. 900 కోట్లు కొల్లగొట్టింది కల్కి మూవీ.
Kalki 2898 AD Box Office Collection Day 12: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన ప్రతిష్టాత్మక కల్కి 2898 ఏడీ చిత్రం ఇండియాలో 12వ రోజున అంటే జూలై 8న రూ. 11.35 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టింది. అంటే, ఇది పదో రోజు వచ్చిన రూ. 44.35 కోట్ల కంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు.
అయిన మిడ్ వీక్‌లో 11 కోట్లతో మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది కల్కి సినిమా. వీటిలో తెలుగు నుంచి మూడున్నరకోట్లు, తమిళం నుంచి 7 లక్షలు, హిందీ నుంచి ఎక్కువగా ఆరున్నర కోట్లు, కన్నడ నుంచి 15 లక్షలు, మలయాళం నుంచి అతి తక్కువగా 5 లక్షల కలెక్షన్స్ ఉన్నాయి. 12వ రోజున భాషల వారీగా వచ్చిన కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ ఇవి.
ఇక కల్కి సినిమా 12 రోజుల్లో అంటే ఇప్పటివరకు భారత్‌లో రూ. 521.4 కోట్లు వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థలు తెలిపాయి. ఈ కలెక్షన్స్‌లో భాషల వారీగా చూస్తే.. తెలుగు నుంచి 249.05 కోట్లు, తమిళం నుంచి 30.5 కోట్లు, హిందీ నుంచి రూ. 218.9 కోట్లు, కన్నడ నుంచి 4.15 కోట్లు, మలయాళం నుంచి రూ. 18.8 కోట్లుగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ సినిమా వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ. 900 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే ఈ మూవీ 12వ రోజుతో 950 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్ట్‌లు. కాగా రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకున్న కల్కి సినిమా ఇప్పటికీ రూ. 63.63 కోట్ల లాభాలు చేజిక్కించుకుంది. 12వ రోజుతో అవి 80 నుంచి 100 కోట్ల లాభాలు అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇలా మొత్తానికి కల్కి 2898 ఏడీ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా జూన్ 27న విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా మొదటి రోజున న రూ .95.3 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత శుక్రవారం కలెక్షన్స్ కాస్తా తగ్గాయి. దాంతో రెండో రోజున రూ .59.3 కోట్లు వసూలు చేసింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లో బిజినెస్ ఊపందుకోవడంతో శనివారం రూ. 66.2 కోట్లు రాబట్టింది. ఆదివారం బిజినెస్ మరింత పుంజుకుని రూ. 88.2 కోట్లు రాబట్టింది.
అనంతరం వీక్ డేస్ అయిన సోమవారం రూ. 34.15 కోట్లు, మంగళవారం రూ. 27.05 కోట్లు, బుధవారం రూ.22.7 కోట్లు, గురువారం రూ.21.8 కోట్లు, శుక్రవారం రూ.16.9 కోట్ల కలెక్షన్స్ కల్కి మూవీకి వచ్చాయి. శని, ఆదివారాల్లో రూ.34.15 కోట్లు, రూ.44.35 కోట్లు రాబట్టి సెకండ్ వీకెండ్‌లో మళ్లీ బిజినెస్ ఊపందుకుంది.