Kalki Box Office: 800 కోట్లు కొల్లగొట్టిన కల్కి 2898 ఏడీ.. 9వ రోజు వచ్చింది ఎంతంటే?-kalki 2898 ad 9 days worldwide box office collection and reached to 800 cr prabhas kalki box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki Box Office: 800 కోట్లు కొల్లగొట్టిన కల్కి 2898 ఏడీ.. 9వ రోజు వచ్చింది ఎంతంటే?

Kalki Box Office: 800 కోట్లు కొల్లగొట్టిన కల్కి 2898 ఏడీ.. 9వ రోజు వచ్చింది ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu
Jul 06, 2024 01:03 PM IST

Kalki 2898 AD Box Office Collection Day 9: ప్రభాస్-దీపికా పదుకొణె నటించిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో కల్కి సినిమాకు 9 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్స్ ఎంతనే వివరాల్లోకి వెళితే..

800 కోట్లు కొల్లగొట్టిన కల్కి 2898  ఏడీ.. 9వ రోజు వచ్చింది ఎంతంటే?
800 కోట్లు కొల్లగొట్టిన కల్కి 2898 ఏడీ.. 9వ రోజు వచ్చింది ఎంతంటే?

Kalki 2898 AD Worldwide Collections: ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మెయిన్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ సినిమా రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాకు రెండో శుక్రవారం రూ. 19.7 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కల్కి 9వ రోజు కలెక్షన్స్

రెండో శుక్రవారం కల్కి 2898 ఏడీ సినిమాకు వచ్చిన రూ. 19.7 కోట్ల కలెక్షన్స్‌లో తెలుగు నుంచి 5.4 కోట్ల రూపాయల వసూళ్లు ఉన్నాయి. అలాగే తమిళం నుంచి ఒక కోటి, కన్నడ నుంచి రూ. 2 లక్షలు, హిందీ నుంచి 9.4 కోట్లు, మలయాళం నుంచి 7 లక్షల వరకు 9వ రోజు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

9 రోజుల్లో ఇండియాలో కలెక్షన్స్

ఇక 9 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో రూ. 431.55 కోట్ల వసూళ్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటి నుంచి తెలుగులో రూ. 24.1 కోట్లు, హిందీ నుంచి రూ. 171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం ద్వారా రూ. 14.9 కోట్లుగా ఉన్నాయి. ఇక కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 9 రోజుల్లో రూ. 800 కోట్లు వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

800 కోట్ల పోస్టర్

ఈ పోస్టర్ అదిరిపోయింది. చుట్టూ ఉన్న ఫైర్‌లో ప్రభాస్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదల కాగా ఆ మొదటి రోజు రూ. 95.3 కోట్లు వసూలు చేసింది. అనంతరం రెండో రోజైన శుక్రవారం రూ. 59.3 కోట్లు రాబట్టిన ఈ చిత్రం శనివారం బిజినెస్ ఊపందుకోగా రూ. 66.2 కోట్లు రాబట్టింది.

రోజుల వారీగా కలెక్షన్స్

ఇక ఆదివారం బిజినెస్ మరింత పుంజుకుని రూ. 88.2 కోట్లు రాబట్టింది. సోమవారం రూ. 34.15 కోట్లు, మంగళవారం రూ. 27.05 కోట్లు, బుధవారం రూ. 22.7 కోట్లు రాబట్టడంతో వారంలో బిజినెస్ పడిపోయింది. గురువారం కల్కి 2898 ఏడీ రూ. 21.8 కోట్లు, శుక్రవారం రూ. 16.9 కోట్లు వసూలు చేసి మొత్తం రూ. 431.75 కోట్లు రాబట్టింది. ఈ లెక్కలు చూస్తుంటే గురువారం కంటే శుక్రవారం కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు తెలుస్తోంది.

కల్కి క్లైమాక్స్

ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ సీక్వెల్ గురించి నాగ్ అశ్విన్ ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కచ్చితంగా కల్కి 2898 ఏడీ పార్ట్ 2 ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అశ్వత్థామ, కర్ణుడు, సుప్రీమ్ యాస్కిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో సినిమాను ముగించారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.

WhatsApp channel