Prabhas Chakram: రీ రిలీజ్ కానున్న ప్రభాస్ డిజాస్టర్ మూవీ - ఈ వారమే థియేటర్లలోకి వచ్చేస్తోంది!
Prabhas Chakram: ప్రభాస్ డిజాస్టర్ మూవీ చక్రం థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Prabhas Chakram: రీ రిలీజ్ ట్రెండ్ మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులోనే ఎక్కువగా సక్సెస్ అయ్యింది. స్టార్ హీరోలు నటించిన పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ థియేటర్ల రిలీజై కోట్లలో వసూళ్లను రాబట్టాయి. ప్రభాస్ నటించిన వర్షం, మిస్టర్ పర్‌ఫెక్ట్‌తో పాటు మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ రూపంలో తెలుగు ఆడియెన్స్‌ను అలరించాయి. . తాజాగా అతడు హీరోగా నటించిన చక్రం మూవీ మరోసారి థియటర్లలో సందడి చేయబోతున్నది.
మాస్ ఇమేజ్‌కు భిన్నంగా...
ప్రభాస్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చక్రం 2005లో రిలీజైంది. తనకున్న మాస్ ఇమేజ్‌కు భిన్నంగా సాఫ్ట్ రోల్‌లో కనిపిస్తూ ప్రభాస్ చేసిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ డిజాస్టర్ మూవీ దాదాపు పంతోమ్మిది ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూన్ 8న రిలీజ్ అవుతోంది. ఆదివారం రీ రిలీజ్ ట్రైలర్‌ను ఆవిష్కరించడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
పాటలు హిట్...
చక్రం మూవీలో ప్రభాస్‌కు జోడీగా అశిన్, ఛార్మి హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. చక్రం కమర్షియల్‌గా ఫెయిలైనా ఈ సినిమాలోని పాటలు మాత్రం పెద్ద హిట్టయ్యాయి. పాటలతోనే రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై భారీగా హైప్ ఏర్పడింది. కానీ ఆ అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
చక్రం సినిమాలో బ్లడ్ క్యాన్సర్ కారణంగా మరణంతో పోరాడే యువకుడిగా ప్రభాస్ నటించాడు. ప్రభాస్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్, పాటలు బాగున్నా శాడ్ ఎండింగ్ క్లైమాక్స్ కారణంగానే ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.
రెండు నంది అవార్డులు...
కమర్షియల్‌గా ఫ్లాపైనా ప్రభాస్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా చక్రం నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్నది. చక్రం సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్‌గా కృష్ణ వంశీ, ఉత్తమ గేయరచయితగా సిరివెన్నుల సీతారామశాస్ట్రి నంది అవార్డులను అందుకున్నారు.
ఆరు వందల కోట్ల బడ్జెట్...
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపు అరు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
క మల్‌హాసన్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కల్కి 2898 ఏడీ మూవీతో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. కల్కి 2898 ఏడీతో పాటు సలార్ 2, రాజాసాబ్ సినిమాలు చేస్తోన్నాడు ప్రభాస్. రాజా సాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది ఎండింగ్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మూడు సినిమాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో హీరోగా నటిస్తున్నాడు.
టాపిక్