Prabhas Kalki OTT: రెండు ఓటీటీల‌లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే-prabhas kalki 2898 ad likely to streaming amzon prime video and netflix ott platforms ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Kalki Ott: రెండు ఓటీటీల‌లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల‌లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
May 21, 2024 10:38 AM IST

Prabhas Kalki OTT: ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రెండు ఓటీటీల‌లో రిలీజ్ కాబోతోంది. తెలుగు వెర్ష‌న్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుండ‌గా...హిందీ వెర్ష‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల అవుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ
ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ

Prabhas Kalki OTT: రిలీజ్‌కు ముందే ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స‌యింది. ఒక‌టి కాదు రెండు ఓటీటీల‌లో ఈ భారీ బ‌డ్జెట్‌ మూవీ రిలీజ్ కాబోతోంది. క‌ల్కి మూవీ తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ వెర్ష‌న్స్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

హిందీ వెర్ష‌న్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ల్కి ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ క‌లిపి 175 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్ కెరీర్‌లోనే కాకుండా తెలుగులో అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా ప్ర‌భాస్ క‌ల్కి నిలిచిన‌ట్లు స‌మాచారం.

సూప‌ర్ హీరో మూవీ...

సూప‌ర్ హీరో క‌థాంశంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క‌ల్కి 2898 ఏడీ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ప్ర‌భాస్‌కు జోడీగా దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌ల్కి మూవీతోనే దీపికా ప‌డుకోణ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

క‌ల్కి మూవీ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్క‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫ‌స్ట్ పార్ట్‌లో క‌మ‌ల్‌హాస‌న్ క్యారెక్ట‌ర్ ఇర‌వై నిమిషాల కంటే త‌క్కువే ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సెకండ్ పార్ట్‌లో మాత్రం క‌మ‌ల్‌హాస‌న్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించ‌నున్నార‌ని అంటున్నారు.

క‌ల్కి అవ‌తారం స్ఫూర్తితో...

ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా క‌ల్కి తెర‌కెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ మూవీని షూట్ చేశారు. త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డంతో పాటు ఇంగ్లీష్ భాష‌ల్లోకి డ‌బ్ చేసి విడుద‌ల‌చేయ‌బోతున్నారు. భార‌తీయ పురాణాల్లోని క‌ల్కి అవ‌తార‌ గాథ‌ నుంచి స్ఫూర్తి పొందుతూ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ క‌ల్కి మూవీని రూపొందిస్తున్నారు. దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ ఈ మూవీని నిర్మిస్తోన్నాడు.

జూన్ 27న రిలీజ్‌...

జూన్ 27న క‌ల్కి మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను నేష‌న‌ల్ వైడ్‌గా డిఫ‌రెంట్‌గా మేక‌ర్స్ ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. నాలుగు భాష‌ల్లో నాలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. తొలుత ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో మూవీ రిలీజ్ వాయిదాప‌డింది.

క‌ల్కి సినిమాలో భైర‌వ అనే పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతుండ‌గా...అశ్వ‌త్థామ‌గా అమితాబ్‌, కాళీగా క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్నారు. క‌ల్కి కోసం క‌మ‌ల్‌హాస‌న్ కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్‌ విల‌న్‌గా మార‌డం ద‌క్షిణాది వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌ల్కి మూవీకి ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నాడు.

స‌లార్ సీక్వెల్‌…

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌ల్కితో పాటు స‌లార్ సీక్వెల్‌, రాజాసాబ్ సినిమాలు చేస్తోన్నాడు. అలాగే హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ల‌వ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. వీటిలో రాజాసాబ్ ఈ ఏడాది రిలీజ్ కానుంది. స‌లార్ 2తో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024