Indian Re Release Date: సీక్వెల్‍‍కు ముందు భారతీయుడు రీ-రిలీజ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి.. డేట్ ఇదే-kamal haasan director shankar indian bharateeyudu movie set to re release on theatres before sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian Re Release Date: సీక్వెల్‍‍కు ముందు భారతీయుడు రీ-రిలీజ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి.. డేట్ ఇదే

Indian Re Release Date: సీక్వెల్‍‍కు ముందు భారతీయుడు రీ-రిలీజ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి.. డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
May 26, 2024 04:47 PM IST

Indian (Bharateeyudu) Re Release Date: భారతీయుడు సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. 28 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అవుతోంది. సీక్వెల్ రిలీజ్‍కు సుమారు నెల ముందు ఈ మూవీ వస్తోంది.

Bharateeyudu Re Release Date: సీక్వెల్‍‍కు  ముందు భారతీయుడు రీ-రిలీజ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి.. డేట్ ఇదే
Bharateeyudu Re Release Date: సీక్వెల్‍‍కు ముందు భారతీయుడు రీ-రిలీజ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి.. డేట్ ఇదే

Bharateeyudu Re-Release Date: తమిళ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ డ్యుయల్ రోల్‍లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ సినిమా ఐకానిక్‍గా నిలిచింది. 1996లో విడుదలైన ఈ దేశభక్తి యాక్షన్ మూవీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. భారతీయుడు పేరుతో తెలుగులోనూ రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. తమిళంలో రికార్డులు సృష్టించింది. 28 ఏళ్ల తర్వాత ఇండియన్ (భారతీయుడు) సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ఇండియన్-2 చిత్రం ఈ ఏడాది జూలై 12న రిలీజ్ కానుంది. అయితే, అంతకంటే ముందు ఇండియన్-1 చిత్రం మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. 28ఏళ్ల తర్వాత ఈ మూవీ మళ్లీ రీ-రిలీజ్ అవుతోంది.

రీ-రిలీజ్ డేట్ ఇదే

భారతీయుడు (ఇండియన్) సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. తమిళంలోనూ మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ నేడు (మే 26) వెల్లడించింది. “బ్లాక్‍బస్టర్ ఎక్స్‌పీరియన్స్ మరోసారి పొందండి. తెలుగు, తమిళంలో జూన్ 7న భారతీయుడు-1 రీ-రిలీజ్ కానుంది” అని ట్వీట్ చేసింది.

బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారత స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పాత్రతో పాటు అతడి కుమారుడు, అవినీతి అధికారి అయిన చంద్రు క్యారెక్టర్‌ను కూడా భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ పోషించారు. రెండు పాత్రల్లోనూ జీవించేశారు. అవినీతి అధికారుల అంతు చూసే సేనాపతి క్యారెక్టర్ ఐకానిక్ కల్ట్ పాత్రగా నిలిచింది.

1996 మే 9వ తేదీన భారతీయుడు రిలీజై బ్లాక్‍బస్టర్ అయింది. శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రశంసలను పొందింది. దేశభక్తి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఈ మూవీలో ఆకట్టుకున్నాయి. ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం కూడా ఆ మూవీకి మరో హైలైట్‍గా నిలిచింది. భారతీయుడు చిత్రంలో కమల్‍హాసన్‍తో పాటు మనీషా కొయిరాలా, ఊర్మిలా మతోంద్కర్, సుకన్య, మనోరమ, సెంథిల్, కస్తూరి కీలకపాత్రలు పోషించారు. శ్రీసూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు.

సీక్వెల్ ఇలా..

భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇప్పుడు 28ఏళ్ల తర్వాత వస్తోంది. భారతీయుడు-2 (ఇండియన్-2) చిత్రం ఈ ఏడాది జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీ ఎప్పుడో మొదలైనా.. ఆలస్యమవుతూ వచ్చింది. కొన్ని సమస్యల కారణంగా మధ్యలో షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే, మళ్లీ గతేడాది భారతీయుడు-2 పట్టాలు ఎక్కింది. కమల్ హాసన్, శంకర్ ఏకాభిప్రాయానికి రావటంతో ఈ చిత్రం పూర్తయింది.

భారతీయుడు-2 సినిమా నుంచి వచ్చిన సేనాపతి (కమల్ హాసన్) టీజర్ అదిరిపోయింది. అయితే, అంతా సిద్ధమైనా ఈ చిత్రం రిలీజ్ కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు జూలై 12న రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.

భారతీయుడు-2 చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ పతాకాలపై సుభాస్కర్, ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన సౌర సాంగ్ ఆకట్టుకుంది.

టీ20 వరల్డ్ కప్ 2024