Hari Hara Veera Mallu Release: హరిహరి వీరమల్లు రిలీజ్ ప్లాన్ గురించి చెప్పిన నిర్మాత.. సాధ్యమేనా?
Hari Hara Veera Mallu Release: హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఎప్పుడవుతుందా అనే సందిగ్ధత కొనసాగుతోంది. నాలుగేళ్ల కిందట మొదలైన ఈ చిత్రం మళ్లీ ఇటీవలే పట్టాలెక్కింది. అయితే, ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ ప్లాన్‍ను నిర్మాత తాజాగా వెల్లడించారు.
Hari Hara Veera Mallu Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ సినిమా నాలుగేళ్ల కిందట మొదలై ఆలస్యమవుతూ వస్తోంది. ఓ దశలో ఈ మూవీ రద్దయినట్టే అని రూమర్లు వచ్చినా.. ఇటీవలే మళ్లీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా హరిహర వీరమల్లు రూపొందుతోంది. ఈ సినిమా నుంచి ఇటీవలే టీజర్ కూడా వచ్చింది. దర్శకుడు క్రిష్ దాదాపు ఈ మూవీ నుంచి తప్పుకోగా.. ఆ బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ చేపట్టారు. అయితే, ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై మాత్రం సందిగ్ధత నెలకొంది. ఈ తరుణంలో రిలీజ్ ప్లాన్‍ల గురించి ఈ మూవీని సమర్పిస్తున్న ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తాజాగా వెల్లడించారు.
ఆ నెలల్లో ప్లాన్ చేస్తున్నాం
హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఏంఎం రత్నం తాజాగా చెప్పారు. ఇంకా కాస్త షూటింగ్ మిగిలే ఉందని వెల్లడించారు. “ఇంకా 25 రోజుల షూటింగ్ జరగాల్సి ఉంది. పవన్ కల్యాణ్ గ్రీన్‍సిగ్నల్ ఇచ్చిన వెంటనే మొదలవుతుంది. ఏపీ ఎన్నికల ఫలితాలు తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభం కావొచ్చు. సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం” అని ఏఎం రత్నం తెలిపారు.
ఈ మూవీని రెండు పార్ట్‌లుగా మేకర్స్ తీసుకున్నారు. ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తామని టీజర్లో పేర్కొన్నారు. అయితే, సెప్టెంబర్ - అక్టోబర్ మధ్యే ప్లాన్ చేస్తున్నామని ఏఎం రత్నం ఇప్పుడు చెప్పారు.
సాధ్యమవుతుందా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా జనసేనాని పవన్ కల్యాణ్ సుమారు మూడు నెలలుగా షూటింగ్‍లకు దూరంగా ఉన్నారు. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే, పవన్ ముందుగా ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడమే ప్రాధాన్యతగా పెట్టుకుంటారని తెలుస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పవన్ ముందుగా ఓజీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.
ఓజీ చిత్రీకరణ పూర్తయ్యాక హరిహర వీరమల్లుకు పవన్ డేట్స్ కేటాయిస్తారని అంచనాలు ఉన్నాయి. దీంతో హరిహర వీరమల్లు అక్టోబర్‌లో రావడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో అక్టోబర్ సాధ్యం కాకపోతే హరిహర వీరమల్లుకు డిసెంబర్ ఆప్షన్‍ను మేకర్స్ బలంగా పరిగణిస్తున్నారనే టాక్ ఉంది.
హరిహర వీరమల్లు మూవీ నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు. ఏఎం రత్నం కుమారుడైన డైరెక్టర్ జ్యోతి కృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొఘలులు, నవాబులపై పోరాడే బందిపోటుగా ఈ చిత్రంలో పవన్ పాత్ర ఉండనుంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, విక్రమ్‍జీత్ విర్క్, నోరా ఫతేహి, సచిన్ ఖేడేకర్, జుస్సు సెంగుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఏ దయాకర్ రావు నిర్మిస్తుండగా.. ఏఎం రత్నం సమర్పిస్తున్నారు.
టాపిక్