OTT Thriller Movie: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Thriller Movie: ఓటీటీలోకి తాజాగా ఓ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
OTT Thriller Movie: ఓటీటీ, థ్రిల్లర్ మూవీస్.. ఈ కాంబినేషన్ ఎవర్‌గ్రీన్ హిట్. క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్, అడ్వెంచర్ థ్రిల్లర్.. ఇలా ఏ థ్రిల్లర్ మూవీ అయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు అలాంటిదే ఓ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు టీన్స్ కాగా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
టీన్స్ ఓటీటీ స్ట్రీమింగ్
టీన్స్ (Teenz) జులై 12న తమిళంలో థియేటర్లలో రిలీజైంది. అయితే సరిగ్గా రెండు నెలల తర్వాత అంటే గురువారం (సెప్టెంబర్ 12) నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. సినిమా స్టోరీని క్లుప్తంగా చెబుతూ స్ట్రీమింగ్ విషయాన్ని ప్రైమ్ వీడియో వెల్లడించింది.
"13 మంది టీనేజర్లు తమ క్లాస్ కు బంక్ కొట్టి బయటకు వెళ్లాలని అనుకుంటారు. కానీ ఆ నిర్ణయమే వాళ్ల ఎప్పుడూ ఊహించనంత ప్రమాదంలోకి వాళ్లను నెట్టేస్తుంది. టీన్స్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది.
టీన్స్ మూవీ ఏంటంటే?
టీన్స్ ఓ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. రాధాకృష్ణన్ పార్థీబన్ డైరెక్ట్ చేశాడు. 8 మంది టీనేజీ అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. అందులో నక్షత్ర అనే అమ్మాయి నాన్నమ్మ వాళ్ల ఊరు కనగవల్లికి వెళ్లాలని వాళ్లు అనుకుంటారు. అక్కడ 500 ఏళ్ల కిందటి ఓ బావి ఉందని, అక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పడంతో పిల్లలంతా ఎంతో ఆసక్తి చూపుతారు.
అక్కడికి వెళ్లి తాము చాలా ధైర్యవంతులమని నిరూపించుకోవాలని భావిస్తారు. అందుకే స్కూల్ ఎగ్గొట్టి ఆ ఊరికి వెళ్తారు. అయితే ఆ క్రమంలో వాళ్లలో ఒక్కొక్కరుగా కొందరు మిస్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు ఇంకెలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరికి ఆ టీనేజర్లందరూ సురక్షితంగా తిరిగి వస్తారా లేదా అన్నది మూవీలోనే చూడాలి.
జులై 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు కాస్త పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అటు ఐఎండీబీలోనూ ఆడియెన్స్ ఈ మూవీకి 7.9 రేటింగ్ ఇవ్వడం విశేషం. థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ వీకెండ్ ఈ మూవీ ట్రై చేయొచ్చు.