96 Sequel: హృదయాలను హత్తుకున్న తమిళ క్లాసిక్ హిట్ సినిమాకు సీక్వెల్.. అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు-vijay sethupathi trisha classic movie 96 to get sequel director prem kumar gives the updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  96 Sequel: హృదయాలను హత్తుకున్న తమిళ క్లాసిక్ హిట్ సినిమాకు సీక్వెల్.. అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు

96 Sequel: హృదయాలను హత్తుకున్న తమిళ క్లాసిక్ హిట్ సినిమాకు సీక్వెల్.. అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 11, 2024 06:44 PM IST

96 Sequel: 96 సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‍పై దర్శకుడు అప్‍డేట్ ఇచ్చారు. దీంతో ఈ విషయంపై వైరల్ అవుతోంది. ఈ సీక్వెల్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ ఇచ్చిన అప్‍డేట్ ఏంటో ఇక్కడ చూడండి.

96 Sequel: హృదయాలను హత్తుకున్న తమిళ క్లాసిక్ హిట్ సినిమాకు సీక్వెల్.. అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు
96 Sequel: హృదయాలను హత్తుకున్న తమిళ క్లాసిక్ హిట్ సినిమాకు సీక్వెల్.. అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు

తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి, స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలు పోషించిన 96 చిత్రం ఓ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం బ్లాక్‍బస్టర్. 2018లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. చాలా మంది మదిలో నిలిచిపోయింది. 96 సినిమాకు సీక్వెల్ వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో అదిరిపోయే అప్‍డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రేమ్ కుమార్.

స్క్రిప్ట్ కంప్లీట్

96 సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసినట్టు దర్శకుడు ప్రేమ్ కుమార్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేసినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ స్కిప్ట్‌ను విజయ్ సేతుపతి, త్రిష అంగీకరిస్తే షూటింగ్ మొదలవుతుందని ప్రేమ్ కుమార్ అన్నారు. “96 సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. విజయ్ సేతుపతి, త్రిష‍కు ఈ స్క్రిప్ట్ విని, అంగీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ దశకు వెళుతుంది” అని ప్రేమ్ అన్నారు.

ముందుగా 96 మూవీకి సీక్వెల్ ఆలోచన తనకు లేదని, కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి స్ఫూర్తి కలిగిందని ప్రేమ్ చెప్పారు. ఈ స్క్రిప్ట్‌ను ఇప్పటికే విజయ్ సేతుపతి భార్యకు నరేట్ చేశానని, ఆమెకు నచ్చిందని తెలిపారు. “నేను 96 చిత్రానికి సీక్వెల్ రాయకూడనదని అనుకున్నా. కానీ రెస్పాన్స్ వల్ల రాసేశా. ఆ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీని రూపొందించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నా. సీక్వెల్‍లో పర్ఫార్మెన్స్ కోసం నేను చాలా ఎదురుచూస్తున్నా. అయితే, పూర్తిగా నా చేతుల్లో ఉండదు. విజయ్, త్రిష డేట్ల అందుబాటులో ఉండాలి. అది త్వరలోనే అవుతుందని నేను ఆశిస్తున్నా” అని ప్రేమ్ కుమార్ చెప్పారు.

స్కూల్‍లోనే ప్రేమలో పడే రామ్ (విజయ్ సేతుపతి), జున్ను (త్రిష) చుట్టూ 96 సినిమా నడుస్తుంది. అనుకోకుండా విడిపోవడం.. జున్ను పెళ్లి అయిన తర్వాత స్టూడెంట్స్ గెట్‍ టు గెదర్‌లో వారిద్దరూ కలుస్తారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. హృదయాన్ని హత్తుకునేలా ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, త్రిష అద్భుతంగా నటించారు.

96 చిత్రానికి గోవింద్ వసంత్ అందించిన పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బలంగా నిలిచాయి. క్లాసిక్ పాటలుగా నిలిచాయి. ఈ మూవీ 2018 అక్టోబర్ 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రూ.18కోట్లతో రూపొందిన ఈ మూవీ సుమారు రూ.50 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకోవటంతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది.

తెలుగులోనూ..

96 చిత్రంలో తెలుగులో జాను పేరుతో రీమేక్ అయింది. ఈ మూవీలో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులోనూ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. తెలుగులోనూ ఈ చిత్రం మ్యాజిక్ రిపీట్ చేసింది. అయితే, కలెక్షన్ల పరంగా అంత పెద్ద హిట్ కాలేదు. జాను చిత్రాన్ని దిల్‍రాజు నిర్మించారు. గోవింద్ వంతనే మ్యూజిక్ ఇచ్చారు.