OTT Releases: ఇవాళ రిలీజైన సినిమాలు వచ్చేది ఈ ఓటీటీల్లోనే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, స్త్రీ2, తంగలాన్ ఓటీటీలివే-ott releases mr bachchan double ismart thangalaan stree 2 raghu thatha ott partners revealed netflix prime video zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఇవాళ రిలీజైన సినిమాలు వచ్చేది ఈ ఓటీటీల్లోనే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, స్త్రీ2, తంగలాన్ ఓటీటీలివే

OTT Releases: ఇవాళ రిలీజైన సినిమాలు వచ్చేది ఈ ఓటీటీల్లోనే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, స్త్రీ2, తంగలాన్ ఓటీటీలివే

Hari Prasad S HT Telugu
Aug 15, 2024 10:15 AM IST

OTT Releases: ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలుగు, తమిళం, హిందీల్లో రిలీజైన టాప్ మూవీస్ ఓటీటీ పార్ట్‌నర్స్ ఖరారయ్యాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, రఘు తాతా, స్త్రీ2, తంగలాన్ లాంటి సినిమాలు ఏ ఓటీటీల్లో రాబోతున్నాయో తేలిపోయింది. బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీస్ వచ్చే ఓటీటీలు ఇవే.

ఇవాళ రిలీజైన సినిమాలు వచ్చేది ఈ ఓటీటీల్లోనే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, స్త్రీ2, తంగలాన్ ఓటీటీలివే
ఇవాళ రిలీజైన సినిమాలు వచ్చేది ఈ ఓటీటీల్లోనే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, స్త్రీ2, తంగలాన్ ఓటీటీలివే

OTT Releases: ఇండిపెండెన్స్ డే హాలీడేతోపాటు లాంగ్ వీకెండ్ ఉండటంతో గురువారం (ఆగస్ట్ 15) వివిధ భాషల్లో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగులో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రాగా.. తమిళంలో తంగలాన్, రఘు తాతా.. హిందీలో స్త్రీ2, ఖేల్ ఖేల్ మే మూవీస్ వచ్చాయి. మరి ఈ సినిమాలు థియేటర్లలో బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఏ ఓటీటీల్లోకి రాబోతున్నాయో చూడండి.

ఓటీటీ పార్ట్‌నర్స్ ఇవే

చాలా వరకు పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ కు ముందే ఓటీటీలతో డీల్ కుదుర్చుకుంటున్నాయి. అయితే కొన్ని డీల్స్ గురించి ముందే చెప్పేస్తుండగా.. మరికొన్నింటి గురించి మూవీస్ రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తోంది. అలా గురువారం (ఆగస్ట్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో ఏ మూవీ ఏ ఓటీటీతో డీల్ కుదుర్చుకుందో తేలిపోయింది.

మిస్టర్ బచ్చన్ - నెట్‌ఫ్లిక్స్

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమాకు తొలి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ మాస్ ఎంటర్టైనర్ నాలుగు వారాల తర్వాత అంటే వచ్చే నెల మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డబుల్ ఇస్మార్ట్ - ప్రైమ్ వీడియో

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆరేళ్ల కిందట వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఓ రేంజ్ లో హిట్ అయింది. దీంతో ఈ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ భారీ అంచనాల మధ్య రిలీజైంది. అందుకు తగినట్లే సినిమాకు కాస్త పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానుంది.

తంగలాన్ - నెట్‌ఫ్లిక్స్

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ఈ తంగలాన్ మూవీ చాలా రోజుల పాటు ఊరించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీఎఫ్ అసలు కథను చెప్పబోతున్న ఈ సినిమాలో విక్రమ్ తన లుక్ తోనే ఆకర్షించాడు. ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతమయ్యాయి.

రఘు తాతా - జీ5 ఓటీటీ

కీర్తి సురేశ్ నటించిన మూవీ రఘు తాతా. ఈ సినిమా కూడా గురువారం (ఆగస్ట్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీకి పెద్దగా పాజిటివ్ రివ్యూలు రావడం లేదు. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది.

స్త్రీ 2 - ప్రైమ్ వీడియో

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన ఈ హిందీ హారర్ కామెడీ మూవీ ఆరేళ్ల కిందట వచ్చిన స్త్రీ కంటే కూడా బాగుందంటూ రివ్యూలు వస్తున్నాయి. ఈ మూవీ రెండు నెలల తర్వాత ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రాబోతోంది.

ఖేల్ ఖేల్ మే - నెట్‌ఫ్లిక్స్

ఓ మంచి హిట్ కోసం చూస్తున్న అక్షయ్ కుమార్ కు ఈ ఖేల్ ఖేల్ మేతో అది దొరికినట్లే కనిపిస్తోంది. ఈ కామెడీ మూవీ తొలి రోజే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకుంది.