Mr Bachchan Twitter Review: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు రెస్పాన్స్ ఎలా వస్తోందంటే..-mr bachchan twitter review fans praising ravi teja and bhagyashri borse energy but not impressed with haris shankar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Twitter Review: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు రెస్పాన్స్ ఎలా వస్తోందంటే..

Mr Bachchan Twitter Review: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు రెస్పాన్స్ ఎలా వస్తోందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 14, 2024 11:45 PM IST

Mr Bachchan Twitter Review: మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్ షోలు నేడు ప్రదర్శితమయ్యాయి. ఈ చిత్రం రేపు (ఆగస్టు 15) రిలీజ్ కానుండగా.. నేటి సాయంత్రమే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Mr Bachchan Twitter Review: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’సినిమాకు రెస్పాన్స్ ఎలా వస్తోందంటే..
Mr Bachchan Twitter Review: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’సినిమాకు రెస్పాన్స్ ఎలా వస్తోందంటే..

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాపై బోలెడు అంచనాలు పెట్టున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా చేశారు. బాలీవుడ్ మూవీ ‘రైడ్’కు రీమేక్‍గా ఈ చిత్రాన్ని తెరక్కించారు దర్శకుడు హరీశ్ శంకర్. అయితే, తాను చాలా మార్పులు చేసి ఎంటర్‌టైనింగ్‍గా మిస్టర్ బచ్చన్ మూవీని రూపొందించానని హరీశ్ శంకర్ చెప్పారు. ఓ బడా పారిశ్రామికవేత్త ఇంటిపై ఐటీ రైడ్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రం రేపు (ఆగస్టు 15) రిలీజ్ కానుండగా.. నేటి (ఆగస్టు 14) సాయంత్రమే ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో ఈ మూవీని చూసిన కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

రవితేజ, భాగ్యశ్రీ ఎనర్జీ అదుర్స్.. పాటలు సూపర్

మిస్టర్ బచ్చన్ సినిమాకు మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హైలైట్ అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో చాలా మంది పోస్టులు చేస్తున్నారు. రవితేజ ఎనర్జీ, మాస్ యాక్షన్, నాటు డ్యాన్సులు, స్వాగ్ అదిరిపోయానని అంటున్నారు. భాగ్యశ్రీ అందంతో పాటు డ్యాన్సులతో దుమ్మురేపేశారని, పాటలు సూపర్ అని అంటున్నారు. రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగుందని, ఇద్దరి కాంబినేషన్‍లో ఫస్టాఫ్‍లో సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయని పోస్టులు చేస్తున్నారు. సత్య కామెడీ కూడా ఆకట్టుకుందని అంటున్నారు. ఈ చిత్రంలో పాటలు సూపర్ అంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. రవితేజ మాస్ జాతర అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. భాగ్య శ్రీ ఫస్ట్ తెలుగు సినిమాతోనే పూర్తి మెప్పించేశారని పోస్టులు చేస్తున్నారు.

ఈ విషయాల్లో అసంతృప్తి

రైడ్ సినిమాలోని సోల్‍ను మిస్టర్ బచ్చన్ చిత్రంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ సరిగా చూపలేకపోయారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎంటర్‌టైనింగ్‍గా ఉన్నా.. కథకు కనెక్ట్ కాలేమని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరేషన్, స్క్రీన్‍ప్లే ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని అంటున్నారు. ఎంటర్‌టైన్‍మెంట్ కూడా కొన్ని చోట్లే పండిందని వెంకీ రివ్యూస్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి యూజర్ పోస్ట్ చేశారు. “మిస్టర్ బచ్చన్ సినిమా ఓ ఔట్‍డేటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. రైడ్ మూవీ సోల్ నుంచి పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. కమర్షియల్ ఎలిమెంట్లతో నిండినా.. పెద్దగా వర్క్ అవలేదు. ఎంటర్‌టైనింగ్ అంశాలు కొన్ని చోట్ల పని చేశాయి. అయితే ఎక్కువ భాగాల్లో సహనాన్ని పరీక్షిస్తాయి. హీరోయిన్ భాగ్యశ్రీని హైలైట్ చేయాలని డైరెక్టర్ ప్రయత్నించారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. పాటలు అద్భుతంగా ఉన్నాయి” అని వెంకీ రివ్యూస్ నుంచి ట్వీట్ పోస్ట్ అయింది.

మిస్టర్ బచ్చన్ సినిమా 1980ల్లో సాగుతుంది. అయితే, ఈ చిత్రంలో ఫారిన్ లోకేషన్లలో మోడ్రన్ దుస్తుల్లో సాంగ్స్ ఉండడంపైనా కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాటలు, రవితేజ, భాగ్యశ్రీ డ్యాన్సులు బాగున్నా.. కథలో లీనం అవలేకున్నామనే కామెంట్లు వస్తున్నాయి. రవితేజ, భాగ్యశ్రీ మధ్య లవ్ ట్రాక్, కామెడీ, యాక్షన్ సీన్లతో ఫస్టాఫ్ మెరుగ్గా ఉన్నా.. సెకండాఫ్‍లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపించాయని కూడా టాక్ వస్తోంది.

అయితే, మిస్టర్ బచ్చన్ సినిమాలో హరీశ్ శంకర్ తన మార్క్ డైలాగ్‍లు, యాక్షన్ మెప్పించారని కొందరు నెటిజన్లు అంటున్నారు. రవితేజ డైలాగ్ డెలివరీ కూడా బాగుందని చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. రవితేజ, జగపతి బాబు మధ్య కొన్ని ఇంటెన్స్ సీన్లు కూడా బాగున్నాయని పోస్టులు చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ క్యామియో అదిరిపోయిందంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రవితేజ, భాగ్యశ్రీ, కొన్ని ఎంటర్‌టైనింగ్ సీన్ల కోసం ఈ మూవీని చూడొచ్చంటూ చాలా మంది పోస్టులు చేస్తున్నారు.

మిక్స్‌డ్ రెస్పాన్స్

మొత్తంగా ప్రీమియర్ షోల తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాకు సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రవితేజ, భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, హరీశ్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై కాస్త అసంతృప్తి వస్తోంది. మరి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి. డబుల్ ఇస్మార్ట్ కూడా ఈ మూవీకి పోటీగా రేపే (ఆగస్టు 15) రిలీజ్ కానుంది.

మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీ చేశారు.