Mr Bachchan Trailer: ‘చాలా మంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు’: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా..-mr bachchan trailer released ravi teja entertains in all aspects ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Trailer: ‘చాలా మంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు’: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా..

Mr Bachchan Trailer: ‘చాలా మంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు’: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 07, 2024 09:32 PM IST

Mr Bachchan Trailer: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్, డైలాగ్ డెలివరీతో మళ్లీ అదరగొట్టారు రవితేజ. ఈ ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.

Mr Bachchan Trailer: చాలా మంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు.. ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా.
Mr Bachchan Trailer: చాలా మంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు.. ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా.

ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. బాలీవుడ్ మూవీ రైడ్‍కు రీమేక్‍గా ఈ చిత్రం తెరకెక్కింది. మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ట్రైలర్ నేడు (ఆగస్టు 7) రిలీజ్ అయింది.

ఐటీ దాడి ఆధారంగా..

1980ల బ్యాక్‍డ్రాప్‍లో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కింది. పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‍పై జరిపిన ఐటీ దాడుల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో ఇన్‍కమ్ ట్యాక్స్ శాఖ అధికారిగా రవితేజ నటించారు. మిస్టర్ బచ్చన్ ట్రైలర్లో రవితేజ యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్వాగ్ అదిరిపోయాయి. ఈ మూవీ ఎంత ఎంటర్‌టైనింగ్‍గా ఉంటుందో ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ట్రైలర్ ఇలా..

“సరిహద్దు కాపాడే వాడే సైనికుడు కాదు. సంపద కాపాడే వాడు కూడా సైనికుడే” అంటూ రవితేజ డైలాగ్‍తో మిస్టర్ బచ్చన్ ట్రైలర్ షురూ అయింది. ఆ తర్వాత భాగ్యశ్రీ బోర్సేను ప్రేమలో దింపేందుకు బచ్చన్ (రవితేజ) ట్రై చేస్తాడు. ఇది కూడా ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. మాస్ డ్యాన్స్‌తోనూ రవితేజ, భాగ్యశ్రీ మెప్పించారు.

ఓ బిగ్‍షాట్ మీద ఇన్‍కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలని రవితేజకు ఉన్నతాధికారులు చెబుతారు. తనకు పనే ముఖ్యమంటూ సిద్ధమవుతాడు రవితేజ. తన ఇంటిపై ఐటీ దాడి జరగకుండా అడ్డుకోవాలని జగపతి బాబు పట్టుదలగా ఉంటాడు. అన్నింటిని దాటుకొని రైడ్ చేస్తాడు రవితేజ. "ఇండియన్ ఆర్మీ ఎంత పవర్‌ఫుల్లో.. ఇన్‍కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా అంతే పవర్‌ఫుల్ అని నిరూపిస్తా” అని రవితేజ డైలాగ్ ఉంది. ఆ తర్వాత హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది.

రూమర్లపై సెటైర్

రూమర్లపై ఈ ట్రైలర్‌లో ఇన్‍డైరెక్ట్‌గా ఘాటైన పంచ్ ఉంది. “ఓసి పిచ్చి బుజ్జమ్మ.. చాలా మంది భయపడేది సమస్యలకు కాదు.. పుకార్లకు.. రూమర్లకు. పనీపాటా లేని చాలా మంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు” అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఉంది. సినీ ఇండస్ట్రీ గురించి వస్తున్న రూమర్లపై ఇటీవల ఫైర్ అవుతున్న డైరెక్టర్ హరీశ్ శంకర్.. కావాలనే ఈ డైలాగ్ రాసుకున్నట్టు అర్థమవుతోంది. ఆగస్టు 15వ తేదీన షోలే రిలీజైందని రవితేజ చెప్పే డైలాగ్‍తో మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ముగిసింది.

రవితేజ మార్క్ యాక్టింగ్, యాక్షన్.. హరీశ్ శంకర్ మార్క్ టేకింగ్‍తో మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. మిక్కీ జే మేయర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. 1980ల వింటేజ్ ఫీలింగ్ లుక్ ట్రైలర్‌లో స్పష్టంగా ఉంది. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ ఇందుకు తగ్గట్టే అదిరిపోయింది. స్టైలిష్ యాక్షన్ ఈ ట్రైలర్‍కు హైలైట్‍గా ఉంది.

మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. ఇక ఆగస్టు 15న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ పోటీగా ఉండనుంది. ఈ క్లాష్ మరింత ఇంట్రెస్టింగ్‍గా ఉంది.