OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!
OTT Movies To Watch This Weekend: ఈవారం ఓటీటీలోకి అనేక సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చాయి. వాటిలో లేటెస్ట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు సైతం ఉన్నాయి. వాటన్నింటిలో ఈ వారం ఏమాత్రం మిస్ అవ్వకూడని సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Must Watch OTT Movies This Weekend: ఓటీటీలో సినిమాలు వెబ్ సిరీసులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుంటాయి. వాటన్నింటిలో ఏది చూడాలి అనేది చాలా కన్ఫ్యూజన్‌గా ఉంటుంది. ఈ వారం అయితే 21కిపైగా సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. కేవలం శుక్రవారం రోజునే 10 సినిమాలు వచ్చాయి. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన వాటిలో ఏమాత్రం మిస్ కాకూడని ఈ నాలుగింటి గురించి తెలుసుకోండి.
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఓటీటీ
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ హిట్ సిరీస్ బాహుబలి. దీని నుంచి వచ్చిన రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. దీని నుంచి ప్రీక్వెల్‌గా యానిమేటెడ్ వెబ్ సిరీస్‌గా వచ్చింది బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ (Baahubali: Crown of Blood OTT). ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) మే 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
హిందీలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ ఇతర భాషల్లోను ప్రసారం అవుతోంది. అయితే ప్రస్తుతానికి బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ నుంచి రెండు ఎపిసోడ్స్ మాత్రమే అందుబాటులో ఉంచారు. వారానికో ఎపిసోడ్ ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. కట్టప్పే విలన్‌గా సరికొత్త కథతో వచ్చిన బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్‌ను ఈ వారంలో పిల్లలతో పాటు పెద్దలు కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది.
తళమై సెయలగమ్ ఓటీటీ
సలార్ (Salaar) విలన్, కోలీవుడ్ నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ వబ్ సిరీస్ తళమై సెయలగమ్ (Thalaimai Seyalagam OTT) తమిళంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5లో (Zee5 OTT) మే 17 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళనాడు రాజకీయాలపై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సిరీస్ కచ్చితంగా మస్ట్ వాచ్ వెబ్ సిరీస్.
బస్తర్: ది నక్సల్స్ స్టోరీ ఓటీటీ
హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బస్తర్ ది నక్సల్స్ స్టోరీ (Bastar The Naxal Story OTT). ఇంతకుముందు ది కేరళ స్టోరీ మూవీతో మంచి హిట్ కొట్టిన సుదీప్తో సేన్ దర్శకత్వంలో రెండోసారి అదా శర్మ నటించిన ఈ మూవీ మే 17 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా 15 కోట్ల వ్యయంతో తెరకెక్కిన బస్తర్ సినిమాకు కేవలం కోటి 79 లక్షల నుంచి 3 కోట్ల వరకే బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయి. అయినప్పటికీ ఈ మూవీకి పదికి 6.4 రేటింగ్‌ను ఇచ్చింది ఐఎమ్‌డీబీ (IMDB) సంస్థ. డిజాస్టర్ అయిన స్పెషల్‌గా మారిన ఈ సినిమా ఓసారి లుక్కేయొచ్చు.
జర హట్కే జర బచ్కే ఓటీటీ
విక్కీ కౌశల్ (Vicky Kaushal), సారా అలీ ఖాన్ (Sara Ali Khan) జోడీగా జత కట్టిన రొమాంటిక్ కామెడీ మూవీ జర హట్కే జర బచ్కే (Zara Hatke Zara Bachke OTT). బాలీవుడ్‌లో గతేడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా 11 నెలలకు ఓటీటీలోకి వచ్చింది. జియో సినిమా ఓటీటీలో (Jio Cinema OTT) ఈ సినిమా మే 17 నుంచి హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, మరాఠి ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.