OTT Action Drama: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ డ్రామా.. లో బడ్జెట్ అయినా ఐఎండీబీలో మంచి రేటింగ్..-ott action drama telugu movie mercy killing to stream on aha video from 28th september ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Drama: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ డ్రామా.. లో బడ్జెట్ అయినా ఐఎండీబీలో మంచి రేటింగ్..

OTT Action Drama: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ డ్రామా.. లో బడ్జెట్ అయినా ఐఎండీబీలో మంచి రేటింగ్..

Hari Prasad S HT Telugu
Sep 19, 2024 07:43 PM IST

OTT Action Drama: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత ఓ లో బడ్జెట్ తెలుగు యాక్షన్ డ్రామా వస్తోంది. సీనియర్ నటుడు సాయికుమార్ నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉండటంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ డ్రామా.. లో బడ్జెట్ అయినా ఐఎండీబీలో మంచి రేటింగ్..
ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ డ్రామా.. లో బడ్జెట్ అయినా ఐఎండీబీలో మంచి రేటింగ్..

OTT Action Drama: ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్లలో అంతగా రెస్పాన్స్ దక్కని చిన్న సినిమాలు పండగ చేసుకుంటున్నాయి. ఇలాంటి మూవీస్ ని ప్రేక్షకులు కూడా ఓటీటీలో ఆదరిస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే మెర్సీ కిల్లింగ్ అనే ఓ తెలుగు యాక్షన్ డ్రామా రాబోతోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్న ఆహా వీడియోనే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది.

మెర్సీ కిల్లింగ్ ఓటీటీ రిలీజ్ డేట్

మెర్సీ కిల్లింగ్ ఓ తెలుగు యాక్షన్ డ్రామా. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. సీనియర్ నటుడు సాయికుమార్ నటించిన ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 28 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.

మెర్సీ కిల్లింగ్ ఓ లో బడ్జెట్ మూవీ అయినా కూడా ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉంది. ఈ సినిమాకు పదికిగాను ప్రేక్షకులు 8.8 రేటింగ్ ఇవ్వడం విశేషం. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తి నెలకొంది. అందులోనూ ఐదు నెలల తర్వాత మూవీ డిజిటల్ ప్రీమియర్ కు రాబోతోంది.

మెర్సీ కిల్లింగ్ కథేంటంటే?

మెర్సీ కిల్లింగ్ స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. తన తల్లిదండ్రులు ఎవరో తెలియని ఆమె.. వాళ్లను వెతుక్కుంటూ వెళ్తుంది. ఆమె తన తల్లిదండ్రులను కనిపెడుతుందా? ఈ క్రమంలో ఆమెకు సాయం చేసేది ఎవరు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. కథలో ఓవైపు లీడ్ రోల్స్ మధ్య ప్రేమ కథ కూడా నడుస్తుంది.

ఇక మూవీ ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా బతికే హక్కుతోపాటు గౌరవంగా చనిపోయే హక్కు కూడా ఉంటుందన్న సందేశాన్ని కూడా ఈ మూవీ ఇస్తోంది. తనకు మెర్సీ కిల్లింగ్ కావాలని స్వేచ్ఛ ఎందుకు డిమాండ్ చేసిందన్నది కూడా మూవీ చేస్తే తెలుస్తుంది.

వెంకట రమణ డైరెక్ట్ చేసిన ఈ మెర్సీ కిల్లింగ్ మూవీలో సాయికుమార్ తోపాటు పార్వతీశం, ఐశ్వర్య వుల్లింగల, హారిక, రామరాజు, సూర్యలాంటి వాళ్లు నటించారు. అసలు ఈ పేరుతో థియేటర్లలో ఒక సినిమా వచ్చిందన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆహా వీడియో ద్వారా ఓటీటీలోకి రావడంతో మరింత మంది ప్రేక్షకులకు మూవీ చేరువ కానుంది.

కేవలం రూ.4 కోట్లలోపు బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆహా ఓటీటీ కూడా చాలా తక్కువ మొత్తానికే ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా లోబడ్జెట్ సినిమాలు ఈ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరి ఈ మెర్సీ కిల్లింగ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.