NNS September 24th Episode: భయంతో రాథోడ్​, షాక్​లో మనోహరి.. నోరు జారిన అమర్.. భాగీని చంపేందుకు టెర్రరిస్ట్ ప్లాన్-nindu noorella saavasam serial september 24th episode aravind plan to kill bhagi nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 24th Episode: భయంతో రాథోడ్​, షాక్​లో మనోహరి.. నోరు జారిన అమర్.. భాగీని చంపేందుకు టెర్రరిస్ట్ ప్లాన్

NNS September 24th Episode: భయంతో రాథోడ్​, షాక్​లో మనోహరి.. నోరు జారిన అమర్.. భాగీని చంపేందుకు టెర్రరిస్ట్ ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Sep 24, 2024 08:38 AM IST

Nindu Noorella Saavasam September 24th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌‌లో అరవింద్‌ను పట్టుకునేందుకు ప్లాన్ వేస్తాడు అమర్. ఇంటికెళ్లి భాగీని రెడీ అవ్వమని, బయటకు వెళ్తున్నామని చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న టెర్రరిస్ట్ అరవింద్ భాగీని చంపేందుకు ప్లాన్ వేస్తాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 24th September Episode) అరవింద్‌ను పట్టుకోవడానికి అమర్‌ చెప్పిన ఐడియా విని బాగుంది. కానీ దానివల్ల నువ్వు, నీ కుటుంబం రిస్కులో పడతారు అంటాడు మేజర్​.

నేను ఇండియన్‌ ఆర్మీ సార్‌. నేనే అరవింద్‌‌ను పట్టుకుంటాను. ఒంటి మీద ఈ డ్రెస్ వేసుకున్నప్పుడే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దమని నిర్ణయించుకున్నా​ అంటాడు అమర్​. సరే అని వెళ్లిపోతాడు మేజర్​. రణవీర్‌ దగ్గరకు లాయర్‌ వచ్చి మనోహరి మనిషి బాబ్జీ కలకత్తా వెళ్లాడట. అక్కడ మథర్‌ థెరిస్సా ఆశ్రమానికి వెళ్లాడట అని చెప్తాడు.

అలా అరిచారు

మనోహరి నీ దగ్గర నుంచి వెళ్లాక దుర్గను అక్కడ వదిలేసిందేమో అంటాడు లాయర్‌. కచ్చితంగా అలా చేసి ఉండదని రణవీర్‌ అంటాడు. దుర్గ ఎక్కడుందో కచ్చితంగా మనోహరికి తెలిసే ఉంటుందంటాడు.

అమర్‌ ఇంటికి రావడం చూసి మా ఆయన.. ఏవండి..? అంటూ పరుగులు పెడుతుంది అరుంధతి. మిస్సమ్మా.. మిస్సమ్మా.. అని పిలుస్తాడు అమర్. ఈయనేంటి? వచ్చీ రాగానే మిస్సమ్మను అలా పిలుస్తున్నాడు అనుకుంటుంది అరుంధతి.

భాగీ షాక్

ఏంటండి అలా అరిచారు.. అంటుంది భాగీ. అరవలేదు.. పిలిచాను. ఈరోజు మనం బయటకు వెళ్తున్నాం వెళ్లి రెడీ అవ్వు.. అంటాడు అమర్. మనమంటే.. అని షాకవుతుంది భాగీ. 

మనమంటే నువ్వు నేను కాకుండా ఇంకెవరైనా వస్తారా? ఇద్దరం కలిసే బయటకు వెళ్తున్నాం అంటాడు అమర్​. ఏంటి ఇలా అడుగుతుంది మా ఆయనేనా? అనుకుంటుంది అరుంధతి. అమరేంటి? దాన్ని బయటకు తీసుకెళ్తా అంటున్నాడు అనుకుంటుంది మనోహరి.

ఏయ్‌ లూజ్‌ మాట్లాడుతుంటే వెళ్లిపోతావేంటి? అంటాడు అమర్. ఇదంతా కల అండి ఇప్పుడు నేను కలలో నుంచి లేవాలి అంటే ముందు పడుకోవాలి కదా అందుకే వెళ్తున్నా అని భాగీ చెప్పగానే నిర్మల వచ్చి కల కాదు కాకరకాయ కాదు అంటుంది.

అమర్‌ కూడా ఇది కల కాదు అంటాడు. ఎవరు చెప్పినా భాగీ కలే అంటుంది. పిచ్చి పట్టిన దానిలా నవ్వుతుంది. ఇంతలో అమర్‌ చెయ్యి పట్టుకుని గిల్లగానే భాగీ నిజమే కదా అంటూ పది నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ వెళ్తుంది.

చెప్పిన వినని భాగీ

తర్వాత అమర్‌, భాగీతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఒకవైపు అరుంధతి, మరోవైపు మనోహరి ఇరిటేటింగ్‌‌గా ఫీలవుతుంటారు. మరోవైపు రెడీ కావడానికి పైకి వెళ్లిన భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో రాథోడ్‌ పైకి వచ్చి అసలు విషయం చెప్పబోతే సంతోషంలో భాగీ వినదు. రాథోడ్‌ కిందకు వెళ్లిపోతాడు. అరవింద్‌‌కు తన అనుచరుడు ఫోన్‌ చేసి అన్నా నువ్వు చెప్పినట్టు సింగ్‌ సాబ్‌‌ను కలిశాను అంటాడు.

అమరేంద్ర ఎప్పుడు ఎక్కడ ఉంటాడు. ఎప్పుడు సెక్యూరిటీ ఉండదు. మొత్తం డీటెయిల్స్‌ నాకు కావాలి అంటాడు అరవింద్​. అన్నా అన్నీ డీటెయిల్స్‌ అవసరం లేదు అన్నా ఒక ముఖ్యమైన విషయం. అమరేంద్ర ఏ సెక్యూరిటీ లేకుండా తన వైఫ్‌‌తో కలిసి బయటకు వెళ్తున్నాడట అని చెప్పడంతో ఏంటి నువ్వు చెప్తుంది నిజమా..? సమాచారం కరెక్టేనా..? అని అడుగుతాడు అరవింద్​. పక్కా సమాచారం అన్న.. అని చెప్పగానే నాకు ఒక లోకల్‌ బైకు ఒక స్నీపర్‌ కావాలని అడుగుతాడు అరవింద్.

అలాగేనని కానీ అమరేంద్రను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని హెచ్చరిస్తాడు. దీంతో అమరేంద్రను ఎదుర్కోవడం ఈజీ కాదు. కానీ వాడి భార్యను చంపడం ఈజీయే కదా అంటాడు అరవింద్‌. భాగీ, అమర్‌ బయటకు వెళ్తున్నారని నిర్మల, శివరామ్ హ్యాపీగా ఫీలవుతుంటారు. రాథోడ్‌ మాత్రం భయపడుతుంటాడు. ఇంతలో అమర్‌ రెడీ అయి రాగానే మనోహరి ఈరోజు ఏమైనా స్పెషలా అని అడుగుతుంది.

నోరు జారిన అమర్

ఏం లేదని ఎప్పుడూ తనని బయటకు తీసుకెళ్లలేదు కదా అని చెబుతాడు అమర్. ఇంతలో భాగీ రెడీ అయ్యి వస్తుంది. భాగీని చూసిన అమర్‌ షాకింగ్‌ గా లేచి అచ్చం మీ అక్కలాగే ఉన్నావు మిస్సమ్మ అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. 

అరుంధతి గురించి నిజం భాగీకి తెలుస్తుందా? అమర్​ ప్లాన్​ చెడగొట్టడానికి మనోహరి ఏం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్​ 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!