Niharika on Allu Arjun: అల్లు అర్జున్‌ను సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేయడంపై నిహారిక రియాక్షన్ వైరల్-niharika reacted to sai dharam tej unfollowing allu arjun on instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Niharika On Allu Arjun: అల్లు అర్జున్‌ను సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేయడంపై నిహారిక రియాక్షన్ వైరల్

Niharika on Allu Arjun: అల్లు అర్జున్‌ను సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేయడంపై నిహారిక రియాక్షన్ వైరల్

Hari Prasad S HT Telugu

Niharika on Allu Arjun: మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలన్న వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్ ను సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో చేశాడన్న వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా నాగబాబు కూతురు నిహారిక స్పందించింది.

అల్లు అర్జున్‌ను సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేయడంపై నిహారిక రియాక్షన్ వైరల్

Niharika on Allu Arjun: ఏపీలో ఎన్నికలకు ముందు నుంచి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ మద్దతిచ్చే కూటమికి కాకుండా ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతిచ్చినప్పటి నుంచీ అతనిపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ అతన్ని అన్ ఫాలో చేశాడన్న వార్త వైరల్ కాగా.. దీనిపై నాగబాబు కూతురు, నటి, నిర్మాత నిహారిక కొణిదెల స్పందించింది.

అల్లు అర్జున్ vs మెగా ఫ్యామిలీపై నిహారిక రియాక్షన్

ఏపీ ఎన్నికల తర్వాత పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం, తర్వాత ఏకంగా డిప్యూటీ సీఎం కావడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయాన్ని అందరి కంటే ఎక్కువగా ఆస్వాదించిన సాయి ధరమ్ తేజ్.. ఈ మధ్యే అల్లు అర్జున్ ను ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లలో అన్‌ఫాలో చేయడం సంచలనం రేపింది.

దీంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు నిజమే అని తేలిందంటూ ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. తాజాగా ఈ వివాదంపై నాగబాబు కూతురు నిహారిక కొణిదెల స్పందించింది. ఆమె తాజాగా నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేసిన విషయాన్ని మీడియా ప్రస్తావించింది.

దీనిపై ఆమె స్పందిస్తూ.. "ఈ విషయం మీరు చెప్పే వరకు కూడా నాకు నిజంగా తెలియదు. కానీ అలా చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉండే ఉంటాయి" అని చెప్పడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అంత సులువు కాదు. కానీ నిహారిక మాత్రం అప్పటికప్పుడు కాస్త లౌక్యం జోడించి తెలివిగా సమాధానం చెప్పేసింది.

సాయి ధరమ్ తేజ్ ఏం చేశాడంటే?

ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తోపాటు అతని పార్టీ జనసేన క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలుసు కదా. దీంతో చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో పవన్ కు చోటివ్వడంతోపాటు డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. దీని తర్వాత మెగా ఫ్యామిలీ రేంజ్ మరింత పెరిగింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో చేయడం దుమారం రేపింది.

దీనిపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. మరోసారి మెగా - అల్లు అభిమానులు కొందరు సోషల్ మీడియాలో వాదించుకుంటున్నారు. అల్లు అర్జున్‍ను కావాలనే డీఫేమ్ చేస్తున్నారని అతడి ఫ్యాన్స్ కొందరు ఆరోపిస్తుంటే.. ఆయన చేసిన పనులు అలా ఉన్నాయని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా మెగా - అల్లు అంశం మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

పవన్ కల్యాన్ ప్రమాణ స్వీకారానికి అల్లు కుటుంబం నుంచి ఎవరూ రాకపోవడం కూడా ఈ పుకార్లకు మరింత ఊతమిస్తోంది. మెగా కుటుంబమంతా ఓ పండగలా పవన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జరుపుకున్న తరుణంలో అల్లు ఫ్యామిలీ లేకపోవడం కచ్చితంగా సందేహాలకు తావిచ్చేదే.