Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..-netflix top trending movies and web series laapataa ladies heeramandi on top positions tillu square in second ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Hari Prasad S HT Telugu
May 03, 2024 03:30 PM IST

Netflix Top Trending Movies Web Series: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తే.. మూవీస్ లో లాపతా లేడీస్, సిరీస్ లో హీరామండి నంబర్ వన్ గా కొనసాగుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Netflix Top Trending Movies Web Series: పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. మరి వీటిలో ట్రెండింగ్స్ లో టాప్ లో ఉన్న సినిమాలు, సిరీస్ ఏవో తెలుసా? మూవీస్ లో కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన లాపతా లేడీస్.. వెబ్ సిరీస్ లో సంజయ్ లీలా భన్సాలీ అత్యంత భారీ బడ్జెట్ సిరీస్ హీరామండి టాప్ లో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ మూవీస్

మే నెల తొలి వీకెండ్ లో నెట్‌ఫ్లిక్స్ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఉన్న ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. వీటిలో లాపతా లేడీస్ నంబర్ వన్ గా ఉండటం విశేషం. ఓ చిన్న సినిమాగా రిలీజై.. థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఓటీటీలోనూ అదే రేంజ్ లో దూసుకెళ్తోంది. మహిళా సాధికారత అనే అంశాన్ని సరదాగా, ఆలోచింపజేసేలా ఈ మూవీ రూపొందించారు.

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది. ఈ సినిమాను అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్స్ కు పంపాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 26న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగు పెట్టింది. మరుసటి రోజు నుంచే ఇండియాలో ఈ మూవీ టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. తొలి వారం మొత్తం అదే స్థానంలో కొనసాగుతోంది.

ఇక రెండో స్థానంలో టిల్లూ స్క్వేర్ మూవీ ఉంది. ఆ తర్వాత మూడు నుంచి పది స్థానాల్లో ఉన్న మూవీస్ చూస్తే వరుసగా.. ఆర్టికల్ 370, డియర్, అమర్ సింగ్ చమ్కీలా, దంగే, ఎనీవన్ బట్ యు, ఆల్ ఇండియా ర్యాంక్, ఫైటర్, సిటీ హంటర్ నిలిచాయి.

1. లాపతా లేడీస్

2. టిల్లూ స్క్వేర్

3. ఆర్టికల్ 370

4. డియర్

5. అమర్ సింగ్ చమ్కీలా

6. దంగే

7. ఎనీవన్ బట్ యు

8. ఆల్ ఇండియా ర్యాంక్

9. ఫైటర్

10. సిటీ హంటర్

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ వెబ్ సిరీస్

ఇక నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ చూస్తే సంజయ్ లీలా భన్సాలీ హీరామండి టాప్ లోకి వచ్చేసింది. బుధవారం (మే 1) ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొదలు కాగా.. రెండు రోజుల్లోనే నంబర్ వన్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ గా నిలిచింది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రేక్షకుల వరకూ హీరామండి సిరీస్ అందరినీ మెప్పిస్తోంది.

1. హీరామండి

2. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో

3. డెడ్ బాయ్ డిటెక్టివ్స్

4. బేబీ రీఇండీర్

5. క్వీన్ ఆఫ్ టియర్స్

6. మామ్లా లీగల్ హై

7. ది అసుంటా కేస్

8. మాంక్

9. ది లాస్ట్ ఎయిర్‌బెండర్

10. పారాసైట్ ద గ్రే

IPL_Entry_Point