Netflix top trending movies web series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-netflix top trending movies and web series fighter animal the great indian kapil show 3 body problem in the list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Netflix top trending movies web series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 03, 2024 10:07 AM IST

Netflix top trending movies web series: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ప్రతి వారం టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా మారుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ లిస్టులో ఉన్నవేంటో ఓసారి చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Netflix top trending movies web series: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ తాజా లిస్ట్ వచ్చేసింది. ఇండియాతోపాటు గ్లోబల్ గా ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు, సిరీస్ ఏంటో ఇందులో చూడొచ్చు. ఈ మధ్యకాలంలో చాలా దూకుడుగా వెళ్తూ పెద్ద సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంటున్న ఈ ఓటీటీ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే

నెట్‌ఫ్లిక్స్ ఇండియా మార్చి 25 నుంచి మార్చి 31తో ముగిసిన వారానికి రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో ఇప్పటికీ యానిమల్, డంకీలాంటి మూవీస్ ఉండటం విశేషం.

ఇప్పటికే ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చి చాలా కాలం అవుతోంది. వీటితోపాటు ఈ మధ్యే వచ్చిన ఫైటర్ మూవీ టాప్ లో ఉండగా.. మర్డర్ ముబారక్, రెడ్ ఐ, డామ్‌సెల్, అన్వేషిప్పిన్ కండెతుమ్ లాంటి మూవీస్ కూడా ఉన్నాయి.

1. ఫైటర్

2. మర్డర్ ముబారక్

3. రెడ్ ఐ

4. డామ్‌సెల్

5. యానిమల్

6. అన్వేషిప్పిన్ కండెతుమ్

7. డంకీ

8. ది వేజెస్ ఆఫ్ ఫియర్

9. మెర్రీ క్రిస్మస్ (హిందీ)

10. ది కర్స్ ఆఫ్ లా లోరోనా

నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే

ఇక నెట్‌ఫ్లిక్స్ ఇండియా వెబ్ సిరీస్ జాబితాలో ఈ మధ్యే ఓటీటీలోకి అడుగు పెట్టిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో టాప్ లోకి దూసుకు రావడం విశేషం. టాప్ 10లో ఇంకా ఏమున్నాయో చూడండి.

1. ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో: సీజన్ 1

2. 3 బాడీ ప్రాబ్లెమ్: సీజన్ 1

3. మామ్లా లీగల్ హై: సీజన్ 1

4. టెస్టామెంట్: ది స్టోరీ ఆఫ్ మోసెస్: సీజన్ 1

5. కపిల్ శర్మ: ఐ యామ్ నాట్ డన్ యెట్

6. ది జెంటిల్మెన్: సీజన్ 1

7. క్వీన్ ఆఫ్ టియర్స్: లిమిటెడ్ సిరీస్

8. అవతార్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్: సీజన్ 1

9. ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్: సీజన్ 1

10. బండిడోస్: సీజన్1

ఈ మధ్యే ప్రారంభమైన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో గ్లోబల్ లెవల్లోనూ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో మూడో స్థానంలో ఉండటం విశేషం. అటు సినిమాల జాబితాలో గ్లోబల్ లెవల్ నాన్ ఇంగ్లిష్ సినిమాల్లో ఫైటర్ మూవీ కూడా మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కూడా ఈ ఫైటరే.

నెట్‌ఫ్లిక్స్ లో ఈ టాప్ ట్రెండింగ్ సినిమాలతోపాటు పలు తెలుగు, మలయాళం భాషలకు సంబంధించిన టాప్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లోనూ పుష్ప 2, టిల్లూ స్క్వేర్ లాంటి సినిమాల డిజిటల్ హక్కులను కూడా ఈ ఓటీటీయే దక్కించుకుంది.