Netflix Releases in 2024: 14 వెబ్ సిరీస్‌లు, 8 సినిమాలు.. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ రిలీజెస్ లిస్ట్ ఇదే-netflix releases in 2024 total 14 web series and 8 movies to release this year popular ott released the list ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Releases In 2024: 14 వెబ్ సిరీస్‌లు, 8 సినిమాలు.. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ రిలీజెస్ లిస్ట్ ఇదే

Netflix Releases in 2024: 14 వెబ్ సిరీస్‌లు, 8 సినిమాలు.. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ రిలీజెస్ లిస్ట్ ఇదే

Hari Prasad S HT Telugu
Feb 29, 2024 07:54 PM IST

Netflix Releases in 2024: నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది తమ ఓటీటీలో రిలీజ్ కాబోయే వెబ్ సిరీస్, సినిమాల జాబితాను అనౌన్స్ చేసింది. అందులో హీరామండి, ఖాకీ, కోటా ఫ్యాక్టీర సీజన్ 3లాంటివి ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది రానున్న 14 వెబ్ సిరీస్, 8 సినిమాలు
నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది రానున్న 14 వెబ్ సిరీస్, 8 సినిమాలు

Netflix Releases in 2024: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ 2024లో తమ ప్లాట్‌ఫామ్ రిలీజ్ కాబోయే టైటిల్స్ ను వెల్లడించింది. ముంబైలో గురువారం (ఫిబ్రవరి 29) జరిగిన ఓ ఈవెంట్లో ఈ అనౌన్స్‌మెంట్ చేయగా.. అందులో 14 వెబ్ సిరీస్, 8 సినిమాలు ఉండటం విశేషం. నెక్ట్స్ ఆన్ నెట్‌ఫ్లిక్స్: బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్మెంట్ కా నెక్ట్స్ లెవెల్ పేరుతో ఈ ఈవెంట్ నిర్వహించారు.

నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ ఏడాది 8 టాప్ సినిమాలు రానున్నాయి. ఆ సినిమాల జాబితా మొత్తాన్నీ రిలీజ్ చేసింది. వీటిలో కొన్ని రిలీజ్ డేట్లు రివీల్ చేయగా.. మరికొన్నింటి డేట్లు వెల్లడించలేదు.

అమర్ సింగ్ చంకీలా

ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దిల్జిత్ దోసాంజ్, పరిణీతి చోప్రాలాంటి వాళ్లు నటిస్తున్న ఈ సినిమా వివాదాస్పద సింగర్ అమర్ సింగ్ చంకీలా నిజ జీవిత స్టోరీ. 27 ఏళ్ల వయసులోనే అతన్ని హత్య చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.

ఇక దో పట్టీ, మహరాజ్, మర్డర్ ముబారక్, ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా, సికందర్ కా ముఖద్దర్, విజయ్ 69, వైల్డ్ వైల్డ్ పంజాబ్ లాంటి సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్లను నెట్‌ఫ్లిక్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ సినిమాలు కూడా తమ ప్లాట్‌ఫామ్ పైకి ఎప్పుడు వస్తాయో నెట్‌ఫ్లిక్స్ వెల్లడించనుంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న వెబ్ సిరీస్

ఇక 2024లో నెట్‌ఫ్లిక్స్ లోకి ఏకంగా 14 వెబ్ సిరీస్ రానున్నాయి. దీంతో ఈ ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఈ సిరీస్ లలో కొన్ని కొత్తవి కాగా.. మరికొన్ని సీక్వెల్స్ ఉన్నాయి. అయితే వీటిలోనూ చాలా వరకూ వెబ్ సిరీస్ ల రిలీజ్ డేట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా చెబుతున్న హీరామండి కూడా ఇందులో ఒకటి.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ గ్లింప్స్ ఈ మధ్యే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడే ఈ సిరీస్ 2024లోనే రానుందని అనౌన్స్ చేశారు. తాజాగా మరోసారి రిలీజ్ చేసిన జాబితాలోనూ హీరామండి పేరు ఉంది. ఈ సిరీస్ లో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీమణులు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ లాంటి వాళ్లు ఉన్నారు.

ఈ సిరీస్ కాకుండా డబ్బా కార్టెల్, ఐసీ 814: ది కాందహార్ హైజాక్, ఖాకీ: ది బెంగాల్ చాప్టర్, కోటా ఫ్యాక్టరీ సీజన్ 3, మామ్లా లీగల్ హై (మార్చి 1 నుంచి), మండాలా మర్డర్స్, మిస్‌మ్యాచ్డ్ సీజన్ 3, యే కాలీ కాలీ ఆంఖే సీజన్ 2, ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (మార్చి 30), ది గ్రేటెస్ట్ రైవల్రీ - ఇండియా vs పాకిస్థాన్, టు కిల్ ఎ టైగర్, యో యో హనీ సింగ్: ఫేమస్ లాంటి వెబ్ సిరీస్ ఉన్నాయి.