Chamkila OTT Release Date:డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీయల్ సింగర్ బయోపిక్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Chamkila OTT Release Date: 1988లో దారుణ హత్యకు గురైన పంజాబీ సింగర్ అమర్ సింగ్ చమ్కీలా జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కుతోంది. అమర్ సింగ్ చమ్కీలా పేరుతో తెరకెక్కుతోన్న ఈ బాలీవుడ్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
Chamkila OTT Release Date: పంజాబీ సింగర్ అమర్‌సింగ్ చమ్కీలా 1988లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సింగర్ చనిపోయి 36 ఏళ్లు అయినా ఇప్పటికీ ఆయన మరణం వెనకున్న మిస్టరీ మాత్రం వీడలేదు. ఈ కాంట్రవర్సీయల్ సింగర్ జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కుతోంది. అమర్‌సింగ్ చమ్కీలా పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో దల్జీత్ దోసాంజా హీరోగా నటిస్తోన్నాడు.
డైరెక్ట్‌గా ఓటీటీలో...
ఈ బయోపిక్ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చమ్కీలా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. అమర్ సింగ్ చమ్కీలా మూవీకి రాక్‌స్టార్, లవ్ ఆజ్ కల్ ఫేమ్ ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నాడు.
అమర్ సింగ్ చమ్కీలా ట్రైలర్…
అమర్ సింగ్ చమ్కీలా ట్రైలర్‌ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. అన్‌టోల్డ్ ట్రూ స్టోరీ అనే క్యాప్షన్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైంది. పంజాబీలో సింగర్ చమ్కీలాకు ఉన్న పాపులారిటీని ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. 27 ఏళ్ల వయసులోనే చమ్కీలా హత్యకు గురయ్యాడనే అక్షరాలతో ట్రైలర్ ఎండ్ చేయడం ఆసక్తిని పంచుతోంది.
చమ్కీలా మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఈ సినిమాలో అమర్ సింగ్ చమ్కీలా భార్య అమర్ జోత్ పాత్రలో పరిణీతి చోప్రా కనిపించబోతున్నది. దల్జీత్ దోసాంజా, ఇంతియాజ్ అలీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఫస్ట్ మూవీ ఇదే. చమ్కీలా జీవితంపై రీసెర్చ్ చేసి ఇంతియాజ్ అలీ ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం.
1980 దశకంలో గొప్ప పేరు...
1980 దశంలో ఇండియాలోనే గొప్ప సింగర్స్‌లో ఒకరిగా అమర్‌సింగ్ చమ్కీలా పేరు తెచ్చుకున్నాడు. పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పాటలు అప్పట్లో మారుమోగ్రిపోయేవి. పంజాబీ పల్లె జీవితాన్ని, ఆచారాల్ని, సంస్కృతుల్ని చాటిచెబుతూ ఆయన పాడిన ఎన్నో పాటలు నేటికి వినిపిస్తూనే ఉంటాయి. వివాహేతర సంబంధాలు, డ్రగ్స్, మద్యపానం, కోపం, ఆవేశం లాంటి దుర్గుణాలపై పాటలు రాస్తూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు చమ్కీలా ప్రయత్నించారు. ఆ పాటలే ఆయనకు పేరు ప్రఖ్యాతులతో పాటు శత్రువుల్ని తెచ్చిపెట్టింది.
ఒకే ఏడాదిలో 366 షోస్..
పెళ్లే లాల్‌కరే నాల్, బాబా తేరా నాన్‌కనా, తేకే తా తౌకా తో పాటు పలు పాటలు పంజాబీ యువతను ఉర్రూతలూగించాయి. విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చాడు. ఒకే ఏడాదిలో 366 ప్రదర్శనలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేశాడు.
దారుణ హత్య...
1988 మార్చి 8న ఓ షో కోసం వస్తోన్న సమయంలో పంజాబ్‌లోని మోశంపూర్ ఏరియాలో అమర్ సింగ్ చమ్కీలాపై కొందరు గన్స్‌తో ఎటాక్ చేశారు. ఈ ప్రమాదంలో చమ్కీలాతో పాటు ఆయన భార్య అమర్ జోత్ కూడా చనిపోయింది. మరో ఇద్దరు అసిస్టెంట్స్ కూడా కన్నుమూశారు. ఈ మర్డర్ జరిగి దాదాపు 36 ఏళ్లు అయినా ఇప్పటికీ హత్య చేసింది ఎవరన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. చమ్కీలా జీవితం ఆధారంగా మేశంపూర్ పేరుతో 2018లో ఓ డాక్యుమెంటరీ రూపొందింది.