Yatra 2 Twitter Review: యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ- వైఎస్ జగన్ బయోపిక్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
Yatra 2 Twitter Review: ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది.. వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర చేశాడు.
Yatra 2 Twitter Review: ప్రస్తుతం టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ పొలిటికల్ జోనర్‌లో వచ్చిన తాజా మూవీ యాత్ర -2. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా చేశాడు. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. యాత్ర 2 ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే.…
జగన్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా…
యాత్ర 2 మూవీలో ముఖ్యమంత్రి జగన్ జీవితాన్ని డైరెక్టర్ కళ్లకు కట్టినట్లుగా ఎమోషనల్‌గా చూపించాడని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. జగన్ పాత్రకు జీవా పూర్తిగా న్యాయం చేశాడని, తన మేనరిజమ్స్, బాడీలాంగ్వేజ్‌తో చాలా చోట్ల జగన్‌ను జీవా గుర్తుచేశాడని చెబుతున్నారు. జగన్ జీవితంలోని కీలక ఘట్టాలను చాటిచెబుతూ వచ్చే డైలాగ్స్ బాగున్నాయని అంటున్నారు.
కడపోడు సార్ కడపోళ్ళకి ఈ ఎండలు కష్టాలు కొత్త ఏమీకాదుస్వతహాగా దేనిని అయినా ఓర్చుకునే శక్తి వాళ్ళకి ఎక్కువ...పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలిన అది పిల్లే సార్...పులిని తీసుకొచ్చి బోనులో పెట్టిన అది పులే అంటూ వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో దర్శకుడు మహి వి రాఘవ్ ఏడిపించేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
రాజకీయ కోణాలను కాకుండా…
పొలిటికల్‌గా ప్రత్యర్థులపై విమర్శలను, రాజకీయ కోణాలను కాకుండా తండ్రిని ఇచ్చిన మాటను ఓ కొడుకు ఎలా నిలబెట్టాడన్నదే యాత్ర 2లో డైరెక్టర్ చూపించినట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, లోకేష్‌తో పాటు చాలా మంది పొలిటికల్ లీడర్స్ క్యారెక్టర్స్ కనిపించవని నెటిజన్లు చెబుతోన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే ఎపిసోడ్‌తో ఈ సినిమా ఇంటెన్స్‌గా ఎండ్ అవుతుందని అంటున్నారు.
యాత్ర 2లో నెగెటివ్ అంశాలను వదిలిపెట్టి కేవలం జగన్‌లోని పాజిటివ్ కోణాలను మాత్రమే చూపించారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో చాలా వరకు నిజాలను దాచిపెట్టారని ట్వీట్స్ చేస్తున్నారు. యాత్రలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిచంగా...భారతి పాత్రను కేతకీ నారయణన్ పోషించింది. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.