(1 / 5)
రవితేజ ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్నారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. .
(2 / 5)
ఫిబ్రవరి 9న రజనీకాంత్ లాల్‌సలాం కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. ఇందులో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేస్తోన్నాడు. విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది.
(3 / 5)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతోంది. 2009 నుంచి 2019 మధ్యకాలంలో జగన్ జీవితం జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించబోతున్నాడు.
(4 / 5)
తమిళ మూవీ ట్రూ లవర్ తెలుగులో అదే పేరుతో ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. మణికందన్, శ్రీగౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగులో డైరెక్టర్ మారుతి, బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు