Sudheer Babu: ఆ హీరోలకు ఉండే సూపర్ పవర్ ఉంది.. మా నాన్న పాత్రే ఇది.. నవ దళపతి సుధీర్ బాబు కామెంట్స్-nava dhalapathy sudheer babu comments on marvel super heroes in maa nanna super hero teaser release by nani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sudheer Babu: ఆ హీరోలకు ఉండే సూపర్ పవర్ ఉంది.. మా నాన్న పాత్రే ఇది.. నవ దళపతి సుధీర్ బాబు కామెంట్స్

Sudheer Babu: ఆ హీరోలకు ఉండే సూపర్ పవర్ ఉంది.. మా నాన్న పాత్రే ఇది.. నవ దళపతి సుధీర్ బాబు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 13, 2024 11:50 AM IST

Sudheer Babu About Marvel Movies Super Heroes: నవ దళపతిగా టైటిల్ ఇచ్చుకున్న సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్ సందర్భంగా సుధీర్ బాబు చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆ హీరోలకు ఉండే సూపర్ పవర్ ఉంది.. మా నాన్న పాత్రే ఇది.. నవ దళపతి సుధీర్ బాబు కామెంట్స్
ఆ హీరోలకు ఉండే సూపర్ పవర్ ఉంది.. మా నాన్న పాత్రే ఇది.. నవ దళపతి సుధీర్ బాబు కామెంట్స్

Sudheer Babu Maa Nanna Super Hero: నవ దళపతి సుధీర్ బాబు నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్, వీ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రిలీజ్ చేసిన నాని

మేకర్స్ ఇటీవల మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. సెప్టెంబర్ 12న మా నాన్న సూపర్ హీరో టీజర్‌ను నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మా నాన్న సూపర్ హీరో టీజర్ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"అందరికీ నమస్కారం. సుధీర్ బాబు సన్ అఫ్ పోసాని నాగేశ్వరరావు. మాకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి నాన్న అహర్నిశలు కష్టపడేవారు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన నాన్నకి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు. టీజర్ చూస్తే ఈ సినిమా థీం అందరికీ అర్ధమై ఉంటుంది" అని సుధీర్ బాబు తెలిపాడు.

సూపర్ హీరోల మధ్య లవ్

"ఇది మార్వెల్ సూపర్ హీరో సినిమా కాదు. కానీ, ఆ సినిమాల్లో హీరోలకి ఉండే సూపర్ పవర్ ఈ సినిమాలో ఉంది. ఆ పవర్ పేరు ప్రేమ. ఇద్దరు సూపర్ హీరోల మధ్య జరిగే లవ్ స్టొరీ ఇది. కథ విన్నప్పపుడు ఎంత ఇష్టపడ్డానో, చేసినప్పుడు అంతే ఇష్టంగా చేశాను. మీరు చూసినపుడు కూడా అంతే ఇష్టంగా ఈ సినిమా చూస్తారనే నమ్మకం ఉంది" అని సుధీర్ బాబు పేర్కొన్నాడు.

"మనందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ 'నాన్న'. నాకు హార్ట్ ఫుల్‌గా నచ్చిన సినిమా ఇది. నా కెరీర్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిలిం ఇది. మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ అభిలాష్‌తో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తన టాలెంట్‌ని అక్టోబర్ 11న ఆడియన్స్ విట్నెస్ చేస్తారు" అని నవ దళపతి సుధీర్ బాబు చెప్పాడు.

మా నాన్నగారి పాత్రే

"నిర్మాతలు వంశీ, సునీల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేమంతా కలసి సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్లం. వారి బ్యానర్‌లో నేను హీరోగా చేయడం డ్రీమ్ ఫర్ మీ. ఇందులో కొత్త సాయాజీ షిండేని చూస్తారు. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. సాయి చంద్ గారు టెర్రిఫిక్‌గా చేశారు. చాలా మంచి రోల్ అది. ఆర్ణ చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి మంచి పేరు వస్తుంది. శశాంక్ చాలా ఈజ్‌తో నటించారు" అని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు.

"జై క్రిష్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. డీవోపీ సమీర్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. టీం అందరికీ థాంక్ యూ. సోషల్ మీడియాలో టీజర్‌ని లాంచ్ చేసిన నానికి థాంక్ యూ. టీజర్ తనకి చాలా నచ్చింది. ఇందులో నేను చేసిన పాత్ర ఎగ్జాట్‌గా మా నాన్నగారే. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. అక్టోబర్ 11న ఫ్యామిలీతో కలసి థియేటర్స్‌కి వెళ్లండి. చాలా ఎంజాయ్ చేస్తారు" అని సుధీర్ బాబు తన స్పీచ్ ముగించాడు.