Narne Nithin: ద‌స‌రా బ‌రిలో ఎన్టీఆర్ బావ‌మ‌రిది - శ్రీశ్రీశ్రీ రాజావారు టీజ‌ర్ రిలీజ్-nane nithin sri sri sri rajavaru movie teaser unveiled by director vamshi paidipally ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Narne Nithin: ద‌స‌రా బ‌రిలో ఎన్టీఆర్ బావ‌మ‌రిది - శ్రీశ్రీశ్రీ రాజావారు టీజ‌ర్ రిలీజ్

Narne Nithin: ద‌స‌రా బ‌రిలో ఎన్టీఆర్ బావ‌మ‌రిది - శ్రీశ్రీశ్రీ రాజావారు టీజ‌ర్ రిలీజ్

Nelki Naresh Kumar HT Telugu
Sep 27, 2024 03:17 PM IST

Narne Nithin: మ్యాడ్‌, ఆయ్ త‌ర్వాత నార్నే నితిన్ శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్‌. ద‌స‌రాకు ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను శుక్ర‌వారం డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి రిలీజ్ చేశాడు.

నార్నే నితిన్‌
నార్నే నితిన్‌

Narne Nithin: మ్యాడ్‌, ఆయ్ మూవీతో వ‌రుస‌గా రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను ద‌క్కించుకున్నాడు ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్‌. ఈ సూప‌ర్ హిట్ మూవీస్ త‌ర్వాత శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

శ్రీశ్రీశ్రీ రాజావారు టీజర్ ను టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. యాక్ష‌న్‌, ఫ్యామిలీ అంశాల‌తో టీజ‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. ఇందులో మాస్ లుక్‌లో నార్నే నితిన్ క‌నిపిస్తున్నాడు.

శ‌త‌మానం భ‌వ‌తి డైరెక్ట‌ర్‌...

డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ “ శ్రీ శ్రీ శ్రీ రాజావారు టీజర్ బాగుంది. ప్రేమను ఎలక్షన్స్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న గతంలో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ఫ్లేవర్ లోనే మూవీ ఉంటుందని తెలుస్తోంది. మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. నార్నే నితిన్ నాకు ఎన్టీఆర్ గారి మ్యారేజ్ టైమ్ నుంచి తెలుసు.

మ్యాడ్, ఆయ్ సినిమా తర్వాత అత‌డికి శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ద‌క్కుతుంద‌ని నమ్ముతున్నాను. టీజ‌ర్ చూస్తుంటే నార్నే నితిన్ ను మాసీగా సినిమాలో డైరెక్ట‌ర్‌సతీష్ వేగేశ్న ప్ర‌జెంట్ చేసిన‌ట్లుగా అనిపిస్తుంది.ప్రొడ్యూస‌ర్ రామారావుకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాదసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే పర్పెక్ట్ మూవీ ఇది” అని అన్నారు.

హ్యాట్రిక్ హిట్‌...

నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ - " శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా టీజర్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చేతుల మీదుగా రిలీజ్ కావ‌డం ఆనందంగా ఉంది. మ్యాడ్, ఆయ్ సినిమాల తర్వాత నార్నే నితిన్ కు శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలుస్తుంది.

శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించారు. దసరా సంబరాలను రెట్టింపు చేసే చిత్రమిది" అని తెలిపారు.

సంప‌ద హీరోయిన్‌...

శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీలో నార్నే నితిన్‌కు జోడీగా సంపద హీరోయిన్‌గా న‌టిస్తోంది. రావు రమేష్, నరేష్, రఘు కుంచె కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ రాజావారు ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు గ‌తంలో గుర్తుందా శీతాకాలం మూవీని నిర్మించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ల‌వ్ స్టోరీకి కైలాష్ మీన‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మ్యాడ్ సీక్వెల్

శ్రీశ్రీశ్రీ రాజావారు నార్నే నితిన్ ఫ‌స్ట్ మూవీ. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల మూడో సినిమాగా రిలీజ్ అవుతోంది. ప్ర‌స్తుతం నార్నే నితిన్ మ్యాడ్ సీక్వెల్‌లో న‌టిస్తున్నాడు. మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.