‘‘పాత వాహనాలను స్క్రాప్ చేస్తే, కొత్త వెహికిల్ పై డిస్కౌంట్ పొందవచ్చు’’: నితిన్ గడ్కరీ-scrapping old vehicles to buy new nitin gadkari says you can get big discounts ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ‘‘పాత వాహనాలను స్క్రాప్ చేస్తే, కొత్త వెహికిల్ పై డిస్కౌంట్ పొందవచ్చు’’: నితిన్ గడ్కరీ

‘‘పాత వాహనాలను స్క్రాప్ చేస్తే, కొత్త వెహికిల్ పై డిస్కౌంట్ పొందవచ్చు’’: నితిన్ గడ్కరీ

HT Telugu Desk HT Telugu
Aug 28, 2024 03:14 PM IST

Nitin Gadkari: మీ వద్ద ఉన్న పాత వాహనాన్ని స్క్రాప్ చేసి, సంబంధిత సర్టిఫికెట్ ను చూపిస్తే, మీరు కొనే కొత్త వాహనంపై 1.5% నుంచి 3.5% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పలు వాహన తయారీ సంస్థలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

పాత వాహనాలను స్క్రాప్ చేస్తే, కొత్త వెహికిల్ పై డిస్కౌంట్
పాత వాహనాలను స్క్రాప్ చేస్తే, కొత్త వెహికిల్ పై డిస్కౌంట్

Scrapping old vehicles: కాలుష్య ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మీ వద్ద కాలం చెల్లిన పాత వాహనం ఉంటే, ఆ వాహనాన్ని స్క్రాప్ చేసి, సంబంధిత డిపాజిట్ సర్టిఫికేట్ చూపిస్తే, కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. అనేక వాణిజ్య, ప్యాసింజర్ వాహన తయారీదారులు ఇలా డిస్కౌంట్లను అందించేందుకు ఆమోదం తెలిపారని గడ్కరీ వెల్లడించారు.

అధికారిక స్క్రాప్ సర్టిఫికెట్ తో..

"పాత వాహనాలను స్క్రాపింగ్ చేసినట్లుగా చూపే, చెల్లుబాటు అయ్యే డిపాజిట్ సర్టిఫికేట్ తో కొత్త వాహనాల కొనుగోలుకు డిస్కౌంట్లు ఇవ్వడానికి అనేక వాణిజ్య, ప్యాసింజర్ వాహన తయారీదారులు అంగీకరించారు’’ అని గడ్కరీ తెలిపారు. దీనివల్ల పరిశుభ్రమైన, సురక్షితమైన, మరింత సమర్థవంతమైన వాహనాలు మన రోడ్లపై ఉంటాయని అన్నారు. పాత వాహనాలను సరైన పద్ధతిలో స్క్రాపింగ్ చేసి కొత్తవి కొనుగోలు చేసేవారికి వాహన తయారీ సంస్థలు 1.5 శాతం నుంచి 3.5 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తాయన్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలపై..

అంతకుముందు, సియామ్ అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, "వాహనాల స్క్రాపింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై తాము ఇంకా ఆశిస్తున్నామన్నారు. ‘‘ఎందుకంటే స్క్రాపేజ్ విధానం ఇప్పటికే అమలులో ఉంది, కానీ మేము దాని ప్రభావాన్ని పెద్దగా చూడలేదు" అని అన్నారు. కాబట్టి, పాత కాలుష్యకారక వాహనాల స్క్రాపింగ్ కు మరింత ఊతమిచ్చేందుకు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.