Vijay Varasudu Release Date: 'వారసుడు' వస్తున్నాడు.. విజయ్-వంశీ పైడిపల్లి మూవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్-vijay varasudu movie will release on sankranti 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Varasudu Release Date: 'వారసుడు' వస్తున్నాడు.. విజయ్-వంశీ పైడిపల్లి మూవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Vijay Varasudu Release Date: 'వారసుడు' వస్తున్నాడు.. విజయ్-వంశీ పైడిపల్లి మూవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Maragani Govardhan HT Telugu
Oct 25, 2022 01:29 PM IST

Vijay Varasudu Release Date: ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

వారసుడ విడుదల తేదీ కన్ఫార్మ్
వారసుడ విడుదల తేదీ కన్ఫార్మ్

Vijay Varasudu Release Date: దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'/ వారిసు చిత్రం చివరి షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.

దీపావళి సందర్భంగా 2023 సంక్రాంతికి వారసుడు/వారిసుని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో మేకర్స్ పండుగ సీజన్‌ ను సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌ లో విజయ్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, ఒక పెద్ద సుత్తిని పట్టుకొని కనిపించారు. యాక్షన్-బ్లాక్ ని సూచిస్తున్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

క్లాసియెస్ట్ బెస్ట్ లుక్‌ లో విజయ్‌ని ప్రజంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్ పోస్టర్ ‌లకు భారీ స్పందన వచ్చింది. టైటిల్, పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక.

ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.

భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం