Naga Chaitanya: 8.8.8.. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఇవాళే ఎందుకు? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?-naga chaitanya sobhita dhulipala engagement know the significance of this day lions gate portal 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya: 8.8.8.. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఇవాళే ఎందుకు? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

Naga Chaitanya: 8.8.8.. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఇవాళే ఎందుకు? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hari Prasad S HT Telugu
Aug 08, 2024 04:20 PM IST

Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం గురించి చెబుతూ నాగార్జున 8.8.8 అంటూ ఇవాళ్టి తేదీ ప్రత్యేకమని వెల్లడించాడు. మరి ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?

8.8.8.. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఇవాళే ఎందుకు? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?
8.8.8.. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఇవాళే ఎందుకు? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

Naga Chaitanya: రెండేళ్ల పాటు సీక్రెట్ గా రిలేషన్షిప్ కొనసాగించిన లవ్ బర్డ్స్ నాగ చైతన్య, శోభిత మొత్తానికి నిశ్చితార్థంతో సగం పెళ్లి జరుపుకున్నారు. అయితే వాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగిన ఈరోజుకు చాలా ప్రత్యేక ఉంది. నిజానికి వీళ్ల నిశ్చితార్థం గురించి చెబుతూ ఫొటోలను షేర్ చేసిన నాగార్జున తేదీని 8.8.8 గా చెప్పడం విశేషం. మరి ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటో చూడండి.

నాగార్జున ఎందుకలా చెప్పాడు?

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం గురించి ఎక్స్ అకౌంట్ ద్వారా నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు.. "మా తనయుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ ఇవాళ ఉదయం 9:42 గంటలకు జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఆమెను మా కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. 8.8.8. అనంతమైన ప్రేమకు ఇది ఆరంభం" అని అన్నాడు.

నిజానికి ఇవాళ తేదీ ఆగస్ట్ 8, 2024. అంటే 8-8-2024. కానీ నాగ్ మాత్రం 8.8.8. అని చెప్పాడు. 2024 కలిపితే వచ్చేది 8. అందుకే అతడలా చెప్పడం విశేషం. అంతేకాదు ఈ 8.8.8 కి అసలు ప్రత్యేకత వేరే ఉంది. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది.లయన్స్ గేట్ పోర్టల్ తెరుచుకొని గ్రహాలు ఎంతో అనుకూలంగా ఉన్న ఈ రోజున శుభకార్యాలకు అన్ని విధాలా అనుకూలం.

అందుకే చైతన్య, శోభిత నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాల వాళ్లు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీళ్ల పెళ్లి తేదీపై కూడా త్వరలోనే ఒక ప్రకటన రానున్నట్లు అంచనా వేస్తున్నారు. సంఖ్యాశాస్త్రం పరంగా ఈ రోజుకు ప్రత్యేకత ఉండటమే కాదు.. గతంలో ఇదే ఆగస్ట్ 8న చైతన్యకు సమంత తొలిసారి ప్రపోజ్ చేసినట్లు కూడా చెబుతారు.

అసలేంటీ లయన్ గేట్ పోర్టల్?

ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా బలపడేందుకు ఉపయోగపడే అనువైన రోజు ఆగస్ట్ 8. ఈరోజును లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. న్యూమరాలజీ ప్రకారం ఎనిమిది సంఖ్య అదృష్టం, సంపద, పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా చూస్తారు. ఇది అంతులేని శక్తిని సూచిస్తుంది. 8-08-2024 రోజును లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. సింహ రాశిలో సూర్యుడు రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ తో సమలేఖనం చేసినప్పుడు ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఏర్పడుతుంది. ఈ అమరిక జులై 28 నుంచి ఆగస్ట్ 12 వరకు జరుగుతుంది. అయితే లయన్స్ గేట్ పోర్టల్ ఆగస్ట్ 8న అత్యంత శక్తివంతమైన రోజుగా మారుతుంది.

జ్యోతిష్యశాస్త్ర పరంగా లయన్స్ గేట్ పోర్టల్ ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాల మధ్య శక్తి ప్రవాహాన్ని తెరుస్తుందని నమ్ముతారు. ఇది వ్యక్తిగత ఎదుగుదల, ప్రవర్తన, ఆధ్యాత్మిక మేల్కోలుపులకు ఇది అనువైన సమయం. మీ గురించి మీరు తెలుసుకునేందుకు ఇది ఉత్తమమైన సమయం. మీ శక్తిని ఉపయోగించుకునేందుకు మీ కలలు, లక్ష్యాలు, కోరికల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. స్వీయ ఆలోచనలు చేసుకునేందుకు అనువైన కాలం ఇది.