Samantha Heartbreak: సమంత హార్ట్‌బ్రేక్.. వైరల్ అవుతున్న సామ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
Samantha Heartbreak: హార్ట్ బ్రేక్ అంటూ సమంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. గురువారం (ఆగస్ట్ 8) ఉదయం ఆమె ఈ పోస్ట్ చేయగా.. ఇప్పుడు చైతన్య, శోభితా నిశ్చితార్థం వేళ వైరల్ గా మారింది.
Samantha Heartbreak: ఓవైపు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్.. మరోవైపు సమంత హార్ట్ బ్రేక్ పోస్ట్.. గురువారం (ఆగస్ట్ 8) ఉదయం నుంచీ ఇవి రెండూ వైరల్ అవుతున్నాయి. చైతన్య మొదటి భార్య సమంత కావడంతో నెటిజన్లు ఈ రెండింటినీ కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే నిజానికి ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు.
సమంత హార్ట్‌బ్రేక్ పోస్ట్
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం.. సమంత హార్ట్ బ్రేక్ పోస్టులు రెండూ ఒకే రోజు వైరల్ కావడం పూర్తి కాకతాళీయమే. చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ అంటూ ఒక రోజు ముందు నుంచే వార్తలు రాగా.. గురువారం (ఆగస్ట్ 8) ఉదయం 9.42 గంటలకు ఆ తంతు పూర్తయినట్లు నాగార్జునే స్వయంగా అనౌన్స్ చేస్తూ ఫొటోలు షేర్ చేశాడు. అటు అదే సమయానికి సమంత కూడా హార్ట్ బ్రేక్ పోస్ట్ చేసింది.
నిజానికి సమంత చేసిన పోస్టుకు, వీళ్ల నిశ్చితార్థానికి సంబంధం లేదు. పారిస్ ఒలింపిక్స్ లో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ గెలిచే అవకాశం కోల్పోయిన వినేశ్.. మరుసటి రోజే రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఉద్దేశించి సమంత ఈ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ ఎమోజీ పోస్ట్ చేస్తూ.. వినేశ్ చేసిన ట్వీట్ ను షేర్ చేసింది.
రెజ్లింగ్ నుంచి రిటైరవుతున్నట్లు వినేశ్ అనౌన్స్ చేసింది అనే క్యాప్షన్ తో ఆమె రిటైర్మెంట్ ప్రకటనను ఇంగ్లిష్ లోకి ట్రాన్స్‌లేట్ చేసి పోస్ట్ చేయడం గమనార్హం. ఒలింపిక్స్ లో ఈసారి కచ్చితంగా మెడల్ తెస్తుందనుకున్న వినేశ్.. ఫైనల్ బౌట్ తలపడాల్సిన రోజు తన 50 కేజీల బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందంటూ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే.
ఇక పోరాడలేను: వినేశ్
ఈ హార్ట్ బ్రేక్ తర్వాత వినేశ్ ఇక పోరాడలేనంటూ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పింది. ఆమె చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది. "అమ్మా రెజ్లింగ్ నువ్వే గెలిచావు. నేను ఓడిపోయాను. దయచేసి నన్ను క్షమించు. నీ కలలు, నీ ధైర్యం అన్నీ కల్లలయ్యాయి. ఇక నా దగ్గర పోరాడే శక్తి లేదు. గుడ్ బై రెజ్లింగ్. అందరికీ రుణపడి ఉంటాను. క్షమించండి" అని వినేశ్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
గతంలో రెండు ఒలింపిక్స్ లో వినేశ్ పోటీ చేసినా మెడల్ సాధించలేకపోయింది. ఈసారి ప్రపంచ ఛాంపియన్లను కూడా ఓడించి ఫైనల్ చేరి మెడల్ ఖాయం చేసుకున్న తరుణంలో ఇలా జరగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఆ బాధలోనే ఆమె రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పాలన్న తీవ్ర నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై ఆమె వెనక్కి తగ్గుతుందా లేక తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా అన్నది చూడాలి.