Naga Chaitanya Sobhita Engagement: నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసిన నాగార్జున
Naga Chaitanya Sobhita Engagement: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. గురువారం (ఆగస్ట్ 8) ఉదయం వాళ్ల నిశ్చితార్థం జరిగిందంటూ నాగార్జున ఫొటోలు కూడా షేర్ చేశాడు.
Naga Chaitanya Sobhita Engagement: అనుకున్నదే జరిగింది. నాగ చైతన్య అక్కినేని, శోభితా ధూళిపాళ నిశ్చితార్థం జరిగింది. వీళ్ల ఎంగేజ్‌మెంట్ గురువారం (ఆగస్ట్ 8) ఉదయం 9.42 గంటలకు జరిగినట్లు చెబుతూ ఫొటోలు కూడా షేర్ చేశాడు అక్కినేని నాగార్జున. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తనయుడు, హీరో నాగ చైతన్య మరో పెళ్లికి రెడీ అయ్యాడు. చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నట్లుగా అతడు మరో హీరోయిన్ శోభితను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరి నిశ్చితార్థం గురువారం (ఆగస్ట్ 8) ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఒక రోజు ముందు నుంచే వీళ్ల ఎంగేజ్‌మెంట్ వార్తలు రాగా.. ఇప్పుడీ విషయాన్ని నాగార్జున ధృవీకరిస్తూ వాళ్ల ఫొటోలను షేర్ చేశాడు.
వాటిలో కాబోయే భార్యాభర్తలతో నాగ్ ఫొటోలకు పోజులిచ్చాడు. ఇక ఈ జంట కూడా ప్రత్యేకంగా ఫొటోలు దిగింది. ఈ ఫొటోలను నాగ్ తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేస్తూ.. “మా తనయుడు నాగ చైతన్య నిశ్చితార్థం శోభితా ధూళిపాళతో ఇవాళ ఉదయం 9.42 గంటలకు జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆమెను మా కుటుంబంలోకి ఆహ్వానించడాన్ని ఆస్వాదిస్తున్నాం. హ్యాపీ కపుల్ కు శుభాకాంక్షలు. జీవితాంతం వాళ్లు ఆనందంగా, ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్.. 8.8.8.. అనంతమైన ప్రేమకు ఇది ఆరంభం” అని అన్నాడు.
చైతన్య, శోభితా లవ్ స్టోరీ
సమంతతో విడాకుల తర్వాత చైతన్య ఈ గూఢచారి నటి శోభితతో డేటింగ్ లో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి యూరప్ టూర్ కూడా ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇన్నాళ్లూ ఎప్పుడూ ఎవరూ తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ ను కన్ఫమ్ చేయడం కానీ, ఖండించడం కానీ చేయలేదు. ఇప్పుడు సడెన్ గా నిశ్చితార్థంతో ఏకంగా తమ పెళ్లినే కన్ఫమ్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎవరీ శోభిత?
శోభిత ధూళిపాళ ఏపీలోని తెనాలికి చెందినది. 1992 మే 31న జన్మించింది. శోభితా తండ్రి వేణుగోపాల్ రావు ఒక నేవీ ఇంజినీర్. తల్లి శాంతా కామాక్షి ప్రైమరీ స్కూల్ టీచర్. విశాఖపట్నంలో పెరిగిన శోభితా 16 ఏళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ముంబై యూనివర్సిటీలో కార్పొరేట్ లా చేసిన శోభితా భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. 2010లో జరిగిన నేవీ వార్షిక వేడుకల్లో నేవీ క్వీన్ కిరీటం సాధించింది శోభిత.
శోభితా ధూళిపాళ గూఢచారి సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీసుల్లో సూపర్ హాట్ షో చేసి బోల్డ్ హీరోయిన్ అనిపించుకుంది శోభితా ధూళిపాళ.
టాపిక్