Mirzapur 3 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మీర్జాపూర్ మూడో సీజన్.. స్టోరీలైన్, ప్లాట్‍ఫామ్ సహా మరిన్ని వివరాలివే-mirzapur season 3 ott streaming amazon prime video storyline mirzapur s3 release mirzapur 3 ott pankaj tripathi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mirzapur 3 Ott: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మీర్జాపూర్ మూడో సీజన్.. స్టోరీలైన్, ప్లాట్‍ఫామ్ సహా మరిన్ని వివరాలివే

Mirzapur 3 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మీర్జాపూర్ మూడో సీజన్.. స్టోరీలైన్, ప్లాట్‍ఫామ్ సహా మరిన్ని వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 04, 2024 02:16 PM IST

Mirzapur Season 3 OTT Release: మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తోంది. ఎంతో మంది ఎదురుచూస్తున్న ఈ క్రైమ్ డ్రామా మూడో సీజన్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తరుణంలో ఈ సీజన్ గురించి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Mirzapur Season 3 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మీర్జాపూర్ మూడో సీజన్.. స్టోరీలైన్, ప్లాట్‍ఫామ్ సహా మరిన్ని వివరాలివే
Mirzapur Season 3 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మీర్జాపూర్ మూడో సీజన్.. స్టోరీలైన్, ప్లాట్‍ఫామ్ సహా మరిన్ని వివరాలివే

చాలాకాలంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న మీర్జాపూర్ మూడో సీజన్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అయింది. జూలై 5న అంటే మరికొన్ని గంటల్లోనే ఈ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ 3వ సీజన్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. మీర్జాపూర్ తొలి రెండు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. మీర్జాపూర్ సింహాసనం కోసం కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, ఎత్తులకు పైఎత్తులతో ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మీర్జాపూర్ మూడో సీజన్ వస్తోంది. ఈ సీజన్‍కు సంబంధించిన స్టోరీలైన్, నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మీర్జాపూర్ మూడో సీజన్ జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మరికొన్ని గంటల్లోనే ఈ అర్ధరాత్రి ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టనుంది. మూడో సీజన్‍లో 10 ఎపిసిడ్లు ఉండన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 45 నిమిషాల పాటు ఉంటుంది.

మీర్జాపూర్ 3 నటీనటులు

గత రెండు సీజన్లలో ఉన్న నటీనటులు ఎక్కువ మంది మీర్జాపూర్ మూడో సీజన్‍లోనూ ఉండనున్నారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి శర్మ, రసిక దుగ్గల్, విజయ్ వర్మ, హర్షిత గౌర్, ప్రియాన్షు పైన్యులి, రాజేశ్ తైలగ్, ఇషా తల్వార్ ఈ సీజన్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూడో సీజన్‍లో మరికొంత మంది నటులు వస్తారనే అంచనాలు ఉన్నాయి. పంచాయత్ సిరీస్‍లో మెయిన్ రోల్ చేసిన జితేంద్ర కుమార్.. మీర్జాపూర్ ఈ సీజన్‍లో క్యామియో రోల్‍లో కనిపించనున్నారు.

సీజన్ 2 ముగింపు ఇలా..

మీర్జాపూర్‌లో ముఖ్యమైన మున్నా త్రిపాఠి (దివ్యేందు శర్మ) షాకింగ్ హత్యతో సీజన్ 2 ముగిసింది. మున్నాను గుడ్డు (అలీ ఫజల్) చంపేస్తాడు. గుడ్డు, గోలు (శ్వేత త్రిపాఠి) తనను చంపేందుకు ప్రయత్నించటంతో కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) పారిపోతాడు. మీర్జాపూర్ సింహాసనాన్ని గుడ్డు కైవసం చేసుకుంటాడు.

సీజన్ 3 స్టోరీ లైన్

మున్నా త్రిపాఠి చనిపోవడం, కాలీన్ భయ్యా పారిపోవటంతో పూర్వాంచల్‍పై గుడ్డు ఆధిపత్యాన్ని దక్కించుకుంటాడు. కాలీన్ భయ్యా గుర్తులను సమూలంగా చెరిపివేయాలని అనుకుంటాడు. బీనా త్రిపాఠి (రసిక దుగల్) కూడా అతడికి మద్దతుగా నిలబడుతుంది. అయితే, అధికారంతో కళ్లు మూసుకుపోయి చేసే కొన్ని పనులతో గుడ్డు పతనం మొదలవుతుందనేలా ట్రైలర్లో మేకర్స్ చూపించారు. కాలీన్ భయ్యా కూడా మళ్లీ సింహాసనం కోసం తిరిగిరానున్నాడు. మున్నాభాయ్ మరణం వల్ల సానుభూతి ఏర్పడటంతో మాధురీ యాదవ్ రాజకీయాల్లోకి వస్తుంది. దీంతో ఈ మూడో సీజన్‍లో రివేంజ్ డ్రామా ఎత్తులకు పైఎత్తులతో మరింత రసవత్తరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

మీర్జాపూర్ మూడో సీజన్‍కు గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. రెండో సీజన్ వచ్చిన నాలుగేళ్లకు ఈ మూడో సీజన్ వస్తోంది. ఇప్పటికే ఫుల్ క్రేజ్ ఉండటంతో ఈ మూడో సీజన్ ఓటీటీ రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు ఉన్నాయి. మీర్జాపూర్ సిరీస్‍కు కరణ్ ఆయుష్మాన్, పునీక్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నారు. ఆనంద్ భాస్కర్ ఈ సిరీస్‍కు సంగీతం అందించారు. జూలై 5 నుంచి ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ మూడో సీజన్‍ను చూసేయవచ్చు.

WhatsApp channel