Mirzapur Season 3 Streaming Date: మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో-mirzapur season 3 streaming date announced by prime video new season to stream from 5th july ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mirzapur Season 3 Streaming Date: మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో

Mirzapur Season 3 Streaming Date: మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో

Hari Prasad S HT Telugu
Jun 11, 2024 01:04 PM IST

Mirzapur Season 3 Streaming Date: మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీని ప్రైమ్ వీడియో అధికారికంగా అనౌన్స్ చేసింది.

మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో
మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో

Mirzapur Season 3 Streaming Date: మోస్ట్ అవేటెవ్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ ఈ కొత్త సీజన్ గురించి ఊరిస్తూ వస్తున్న ప్రైమ్ వీడియో మొత్తానికి స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేయడం విశేషం. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం ఏకంగా నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మరో నెల రోజుల్లోపే ఈ మూడో సీజన్ రాబోతోంది.

మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే

మీర్జాపూర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేసే అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేసింది. మూడో సీజన్ జులై 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. "మీర్జాపూర్ సీజన్ 3 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. డేట్ నోట్ చేసుకోండి.. మీర్జాపూర్ ప్రైమ్ వీడియోలో జులై 5 నుంచి" అని ప్రైమ్ వీడియో చెప్పింది.

కొన్ని రోజులుగా ఈ కొత్త సీజన్ పై ప్రైమ్ వీడియో ఊరిస్తూ వచ్చింది. సోమవారం (జూన్ 10) కూడా కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠీ) ఓ వీడియో రిలీజ్ చేసింది. మీర్జాపూర్ విషయంలో తుది నిర్ణయం నాదే.. ఈ తేదీ నేనే చెబుతాను.. అయితే కొత్త సీజన్ కోసం మరీ ఎక్కువ రోజులు వేచి చూడాల్సిందేమీ లేదు.. ఒక రోజు ఆగండి అని అతడు ఆ వీడియోలో అన్నాడు.

మొత్తానికి చెప్పినట్లే మంగళవారం (జూన్ 11) స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. జులై 5 నుంచి కొత్త సీజన్ వస్తోందంటూ ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అందులో మీర్జాపూర్ సింహాసనం మంటల్లో ఉండగా.. ఈ సిరీస్ లోని ప్రధాన పాత్రలన్నీ బ్యాక్‌గ్రౌండ్లో చూపించారు. ఈ రివేంజ్, పాలిటిక్స్, పవర్, ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ ఎంతో ఆసక్తి రేపుతోంది.

మీర్జాపూర్ తొలి రెండు సీజన్లలో ఏం జరిగింది?

మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఓ క్రైమ్ థ్రిల్లర్. కాలీన్ భయ్యా ఆ ప్రాంతాన్ని ఏలుతుంటాడు. అతని దగ్గరికి ఏదో ఓ మామూలు పని చేసుకోవడానికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు తర్వాత ఏకంగా అదే మీర్జాపూర్ సింహాసనంపై కన్నేస్తారు. అందులో అన్న తొలి సీజన్లోనే హత్యకు గురి కాగా.. రెండో సీజన్లో తమ్ముడు గుడ్డు భయ్యా (అలీ ఫజల్) ఆ మీర్జాపూర్ సింహాసనం కోసం తిరిగి వస్తాడు.

దీంతో కాలీన్ భయ్యా, మున్నా భయ్యా (దివ్యేందు శర్మ)తో గుడ్డు భయ్యా ఫైట్ చేస్తాడు. ఈ క్రమంలో మున్నా చనిపోగా.. కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకుంటాడు. అక్కడే రెండో సీజన్ ముగుస్తుంది. దీంతో మూడో సీజన్లో మరోసారి తాను కోల్పోయిన మీర్జాపూర్ సింహాసనం కోసం అతడు గుడ్డూ భయ్యాతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. దీంతో ఈ కొత్త సీజన్ ఎలా సాగబోతోందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో పంకజ్ త్రిపాఠీతోపాటు అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠీ, రసికా దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, రాజేష్ తైలాంగ్, షీబా చద్దాలాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ ను ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించింది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ డైరెక్ట్ చేశారు.