Mirzapur Season 3 Trailer: మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. సింహాసనం కోసం మళ్లీ వచ్చిన కాలీన్ భయ్యా-mirzapur season 3 trailer released prime video to stream the new season from july 5th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mirzapur Season 3 Trailer: మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. సింహాసనం కోసం మళ్లీ వచ్చిన కాలీన్ భయ్యా

Mirzapur Season 3 Trailer: మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. సింహాసనం కోసం మళ్లీ వచ్చిన కాలీన్ భయ్యా

Hari Prasad S HT Telugu
Jun 20, 2024 02:55 PM IST

Mirzapur Season 3 Trailer: మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది. ఈసారి మీర్జాపూర్ సింహాసనం కోసం ఫైట్ మరింత తీవ్రంగా ఉండనుంది. గుడ్డు, కాలీన్ భయ్యా మధ్య జరగబోయే అంతిమ సమరంలో గెలిచేదెవరో ఈ కొత్త సీజన్ లో చూడొచ్చు.

మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. సింహాసనం కోసం మళ్లీ వచ్చిన కాలీన్ భయ్యా
మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. సింహాసనం కోసం మళ్లీ వచ్చిన కాలీన్ భయ్యా

Mirzapur Season 3 Trailer: ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది. గురువారం (జూన్ 20) ఈ ట్రైలర్ ను ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసింది. ఈసారి మీర్జాపూర్ సింహాసనం కోసం యుద్ధం ఏ స్థాయిలో జరగబోతోందో ట్రైలర్ ద్వారానే స్పష్టమవుతోంది. గుడ్డూ భయ్యాకి కాలీన్ భయ్యాతోపాటు మరింత మంది శత్రువులు రెడీగా ఉన్నారు.

మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్

మీర్జాపూర్.. ఇప్పటి వరకూ ఇండియన్ ఓటీటీల్లో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి. రెండు సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు మూడో సీజన్ కు సిద్ధమైంది. ఈ కొత్త సీజన్ జులై 5 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు గతంలోనే ప్రైమ్ వీడియో వెల్లడించింది. అయితే తాజాగా గురువారం (జూన్ 20) ట్రైలర్ రిలీజ్ చేశారు. గుడ్డూ భయ్యా (అలీ ఫజల్), కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠీ) మధ్య జరగబోయే అంతిమ సమరం ఎలా ఉండబోతోందో ఈ కొత్త సీజన్ ట్రైలర్ లోనే మేకర్స్ హింట్ ఇచ్చారు.

మున్నా భయ్యా(దివ్యేందు శర్మ)ను అంతం చేయడంతో రెండో సీజన్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే గుడ్డూ దాడిలో నుంచి తప్పించుకున్న కాలీన్ భయ్యా.. అక్కడి నుంచి తీవ్ర గాయాలతో పారిపోతాడు. దీంతో మీర్జాపూర్ సింహాసనం గుడ్డూ సొంతమవుతుంది. అయితే ఈ మూడో సీజన్ లో తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం గుడ్డూ తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చినట్లు మూడో సీజన్ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

మీర్జాపూర్ వెబ్ సిరీస్ తొలి సీజన్ నుంచే మితిమీరిన హింసతో సాగింది. మూడో సీజన్ కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండబోవడం లేదు. ట్రైలర్లోనే సినిమా చూపించేశారు. ఈసారి వయోలెన్స్ డోసు మరింత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మీర్జాపూర్ సింహాసనాన్ని తిరిగి దక్కించుకోవడానికి కాలీన్ భయ్యా ఒక్కడే కాదు.. మరిన్ని శక్తులు కూడా గుడ్డూ భయ్యా మీదికి రాబోతున్నాయి.

ఆ శక్తులను అతడు ఎలా అడ్డుకుంటాడన్నది ఈ సీజన్లో చూడొచ్చు. కాలీన్ భయ్యా ట్రైలర్ చివర్లో ఎంట్రీ ఇచ్చాడు. "ఈ సింహాసనం, ఈ పరంపర నాన్న, నేను తయారు చేశాం. ఇక ఇప్పుడు పూర్వాంచల్ లో గతంలో ఎన్నడూ చూడనిది చేయాల్సిన టైమ్ వచ్చింది" అనే డైలాగుతో కాలీన్ భయ్యా ఇచ్చే ఎంట్రీ ట్రైలర్ కే హైలైట్ అని చెప్పొచ్చు.

మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను గతంలో ఆదరించిన ప్రేక్షకులకు ఈ కొత్త సీజన్ మరింత వినోదం అందించబోతోందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఈ కొత్త సీజన్ జులై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తొలి సీజన్ 2018లో, రెండో సీజన్ 2020లో రాగా.. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మూడో సీజన్ వస్తోంది. దీంతో ఈ సీజన్ ప్రైమ్ వీడియోలో రికార్డులన్నీ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి గుడ్డూ భయ్యా, కాలీన్ భయ్యా మధ్య అంతిమ సమరం చూడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

WhatsApp channel