ETV win casting call: వెబ్ సిరీస్ చూడటమే కాదు.. అందులో నటించడం అంటే కూడా మీకు ఇష్టమా? మీరు ఓ స్టూడెంటా? అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే? ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ తాను నిర్మించబోయే ఒరిజినల్ సిరీస్ కోసం కొత్త నటీనటులకు అవకాశం ఇస్తోంది. ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది.
ఈటీవీ విన్ (ETV win) ఓటీటీ గతంలో #90's వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలుసు కదా. ఈ సిరీస్ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడీ ఓటీటీ మరో ఒరిజినల్ సిరీస్ తెరకెక్కించడానికి సిద్ధమవుతోంది. అయితే ఇందులో నటించేందుకు యువ నటీనటులకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు మంగళవారం (జూన్ 18) తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ చేసింది.
"డియర్ స్టూడెంట్స్.. అడ్మిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడీకి మీ ప్రొఫైల్స్ ని పంపించండి. విన్ ఒరిజినల్ సిరీస్" అనే క్యాప్షన్ తో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో కావాల్సిన అర్హతలు, ప్రొఫైల్స్ పంపించాల్సిన మెయిల్ ఐడీలను పోస్ట్ చేశారు.
ఈటీవీ విన్ ఒరిజనల్ సిరీస్ లో నటించేందుకు కొన్ని అర్హతలు ఉండాలని సదరు ఓటీటీ వెల్లడించింది. వయసు 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి.. స్టూడెంట్ లుక్ కనిపించాలి.. ఆంధ్రా, తెలంగాణ వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.. అని తెలిపింది. ప్రొఫైల్స్ ను pmpair03@gmail.comకు పంపించాలని సూచించింది. ఇక మరిన్ని వివరాల కోసం 8886899490 మొబైల్ నంబర్ లో సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ అందమైన ఇంటర్మీడియట్ కాలేజ్ లైఫ్ స్టోరీలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకోండి అని కూడా ఈటీవీ విన్ తెలిపింది. ఇంటర్ కాలేజీ చుట్టూ తిరిగే స్టోరీగా ఈ సిరీస్ ఉండబోతోందని ఆ ఓటీటీ చెప్పకనే చెప్పింది. పైన చెప్పిన అర్హతలన్నీ ఉండి.. నటనపై ఆసక్తి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే మీ ప్రొఫైల్స్ ను పంపించి వెబ్ సిరీస్ లో నటించే అవకాశాన్ని అందుకోండి.
తెలుగులో ప్రముఖ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ నుంచి వచ్చిందే ఈ ఈటీవీ విన్ ఓటీటీ. ఏడాదికి రూ.499 ప్రీమియంతో సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఇందులో ఈటీవీలో వచ్చే అన్ని షోలతోపాటు సీరియల్స్, ఒరిజినల్ సిరీస్, సరికొత్త సినిమాలను చూడొచ్చు.
ఈటీవీ షోలకు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. వాటిని టీవీలో వచ్చే ముందే చూడాలనుకుంటే ఈటీవీ విన్ ఓటీటీకి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇదే ఓటీటీ నుంచి #90s వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ కు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు యూత్ లక్ష్యంగా కాలేజీ లైఫ్ తో మరో వెబ్ సిరీస్ తీయబోతోంది.