Varun Tej Chiranjeevi: చిరంజీవి చేతుల్లో నాకు, చరణ్, బన్నీలకు బెత్తం దెబ్బలు తప్పలేదు: వరుణ్ తేజ్ కామెంట్స్-matka star varun tej reveals chiranjeevi caned him ram charan allu arjun while growing up ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Tej Chiranjeevi: చిరంజీవి చేతుల్లో నాకు, చరణ్, బన్నీలకు బెత్తం దెబ్బలు తప్పలేదు: వరుణ్ తేజ్ కామెంట్స్

Varun Tej Chiranjeevi: చిరంజీవి చేతుల్లో నాకు, చరణ్, బన్నీలకు బెత్తం దెబ్బలు తప్పలేదు: వరుణ్ తేజ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Nov 07, 2024 12:00 PM IST

Varun Tej Chiranjeevi: చిరంజీవి తనతోపాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ లను బెత్తంతో కొట్టేవాడని వరుణ్ తేజ్ చెప్పాడు. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెదనాన్న గురించి ఈ మట్కా స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

చిరంజీవి చేతుల్లో నాకు, చరణ్, బన్నీలకు బెత్తం దెబ్బలు తప్పలేదు: వరుణ్ తేజ్ కామెంట్స్
చిరంజీవి చేతుల్లో నాకు, చరణ్, బన్నీలకు బెత్తం దెబ్బలు తప్పలేదు: వరుణ్ తేజ్ కామెంట్స్

Varun Tej Chiranjeevi: చిరంజీవి గురించి అతని తమ్ముడు నాగబాబు తనయుడు, టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిన్నతనంలో తనతోపాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు కూడా చిరు నుంచి బెత్తం దెబ్బలు తప్పలేదని అతడు చెప్పడం విశేషం. సిద్ధార్థ్ కన్నన్ షోలో పాల్గొన్న ఈ మట్కా మూవీ స్టార్.. పెదనాన్ని గురించి మాట్లాడాడు.

చిరంజీవి చేతుల్లో దెబ్బలు తప్పలేదు

వరుణ్ తేజ్ త్వరలోనే మట్కా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే అతడు ఈ షోలో పాల్గొన్నాడు. సినిమా కుటుంబం నుంచి వచ్చినా కూడా ఇంత వినయంగా ఎలా ఉండగలుగుతున్నారు అన్న ప్రశ్నకు వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

"చిరంజీవి గారు మమ్మల్ని ఎప్పుడూ చెడిపోకుండా చూసుకున్నారు. మాపై ఆయన ప్రభావం చాలా ఉంది. మేము వినయంగా ఉన్నామని మీకు అనిపిస్తుందంటే అందులో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన ఎప్పుడూ మాపై ఓ కన్నేసి ఉంచేవారు. మమ్మల్ని ఎప్పుడూ నేలపైనే ఉంచారు" అని వరుణ్ వెల్లడించాడు.

అంతేకాదు చిరు ఓ హెడ్ మాస్టర్ పాత్ర పోషించాడని కూడా అతడు సరదాగా చెప్పాడు. "మా ముగ్గురినీ (తను, రామ్ చరణ్, అల్లు అర్జున్) బెత్తంతో కొట్టాడు. నేను చిన్నవాడిని కావడంతో నాకంటే వాళ్లకే ఎక్కువ దెబ్బలు పడి ఉంటాయని అనుకుంటున్నాను. కానీ మేమెప్పుడు ఆయన చెప్పేది వినేవాళ్లం. ప్రతి ఆదివారం ఆయన ఇంట్లో అందరం కలుసుకునేవాళ్లం. అది మా కుటుంబాన్ని ఇలా కలిపి ఉంచింది" అని వరుణ్ అన్నాడు.

చిరుతో వరుణ్ బంధం

చిరంజీవి తమ్ముడైన నాగ బాబు తనయుడే వరుణ్ తేజ్. తన తండ్రి కంటే కూడా వరుణ్ పెదనాన్నతోనే ఎక్కువ చనువుగా ఉండేవాడని వాళ్ల మాటలతో స్పష్టమవుతోంది. ఆ మధ్య ఓ ఈవెంట్లో వరుణ్ గురించి చిరు మాట్లాడాడు.

అన్ని విషయాలు తనతో చెప్పే వరుణ్.. లావణ్యతో ప్రేమ విషయాన్ని మాత్రం దాచి పెట్టినట్లు అప్పట్లో చిరు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన తండ్రికి చెప్పని విషయాలు కూడా తనతో చెప్పే అతడు.. ఈ విషయం చెప్పకపోవడం తనకు కాస్త కోపం తెప్పించినట్లు కూడా చిరంజీవి నవ్వుతూ తెలిపాడు.

ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే త్వరలోనే అతడు మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటించారు. అటు చిరంజీవి సంక్రాంతికి విశ్వంభర మూవీతో రాబోతున్నాడు.

Whats_app_banner