Varun Tej: చిరంజీవి మాస్‌గా ఉందన్నారు.. వరల్డ్ బిల్డింగ్ చాలా కొత్తగా ఉంటుంది.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్
Varun Tej Comments In Matka Trailer Launch: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మట్కా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.
Varun Tej Chiranjeevi Matka Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా' నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మట్కా మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ విషయాలు
ఇటీవల విడుదలైన మట్కా మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దాంతో మట్కా మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా నవంబర్ 2న విడుదలైన మట్కా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. మెగాస్టార్ చిరంజీవి 'మట్కా' ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మట్కా ట్రైలర్ లాంచ్‌లో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
కొత్త ఎక్స్‌పీరియన్స్
మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మా టీమ్ అంతా చాలా పాషన్‌తో ఈ సినిమా చేయడం జరిగింది. నవంబర్ 14న ఈ సినిమా మీ ముందుకు వస్తోంది" అని చెప్పాడు.
మాస్‌గా ఉందని కాంప్లిమెంట్
"నేను మాస్ సినిమా చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది. ఫ్యాన్స్ అందర్నీ హ్యాపీ చేసే సినిమా అవుతుంది. ఈ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను. చిరంజీవి గారికి ట్రైలర్ చాలా నచ్చింది. చాలా మాస్‌గా ఉందని ఆయన కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అని వరుణ్ తేజ్ తెలిపాడు.
అవి కొత్తగా ఉంటాయి
"మట్కా చాలా ఇంపాక్ట్‌ఫుల్ స్టోరీ. క్యారెక్టరైజేషన్, వరల్డ్ బిల్డింగ్ చాలా కొత్తగా ఉంటాయి. వాసు క్యారెక్టర్‌తో ఆడియన్స్ ట్రావెల్ అవుతారు. ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చే సినిమా ఇది. నవంబర్ 14న థియేటర్స్‌లో కలుద్దాం" అని వరుణ్ తేజ్ తన స్పీచ్ ముగించాడు.
కొత్త వరల్డ్‌ను క్రియేట్ చేశాం
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మట్కా ఒక స్పెషల్ ప్రాజెక్ట్. ఒక కొత్త వరల్డ్‌ని క్రియేట్ చేసాం. ఈ ప్రాజెక్టులో పార్ట్ చేసిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. వరుణ్ ఫెంటాస్టిక్. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. జీవి ప్రకాష్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ థాంక్ యూ. నవంబర్ 14న థియేటర్లలో కలుసుకుందాం" అని తెలిపింది.
చాలా తేడా ఉంది
"టీజర్ లాంచ్‌లో చెప్పినట్టు కరుణ్ కుమార్ కథ ఫస్ట్ డే విన్నప్పుడు నుంచి ఇప్పుడు చూసిన ట్రైలర్‌కి నిన్న చూసిన ఎడిట్ రూమ్‌కి చాలా తేడా ఉంది. సినిమాని ఇంత అద్భుతంగా మలిచిన డైరెక్టర్ గారికి థాంక్యూ వెరీ మచ్. వరుణ్ గారు క్రేజీగా కనిపిస్తున్నారు. మీనాక్షి, టీమ్ అందరికీ థాంక్యు వెరీ మచ్" అని నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.