OTT: ఒకే వెబ్ సిరీస్‍లో కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫాహద్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. తెలుగులోనూ..
Manorathangal Web Series OTT Release Date: ఎంతోకాలం నుంచి వేచిచూస్తున్న మనోరతంగల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ సహా 9 మంది స్టార్లు ఈ సిరీస్‍లో నటించారు. 9 కథలు ఉండనున్నాయి. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఎప్పుడు వస్తుందంటే..
మనోరతంగల్ ప్రాజెక్ట్ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. 2021లోనే మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్‍కు రెడీ అయింది. దిగ్గజ నటులైన కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‍లాల్‍తో పాటు స్టార్ నటీనటులైన ఫాహద్ ఫాజిల్, పార్వతి తిరోవోతు, హర్షిత్ ఉత్తమ్ సహా మరికొందరు ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాగా అనుకున్న మనోరతంగల్ ఇప్పుడు వెబ్ సిరీస్‍గా మారింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇప్పుడు వెల్లడించింది.
స్ట్రీమింగ్ తేదీ ఇదే
మనోరతంగల్ వెబ్ సిరీస్ ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మెగా అంథాలజీ సిరీస్ అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం కన్నడ భాషల్లోనూ ఆగస్టు 15న జీ5లో అందుబాటులోకి వస్తుంది.
9 కథలు.. 8 మంది దర్శకులు
మనోరతంగల్ ఆంథాలజీ సిరీస్‍లో మొత్తంగా 9 కథలు ఉంటాయి. 8 మంది డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. ప్రియదర్శన్ రెండు కథలను తెరకెక్కించగా.. మిగిలిన వారు చెరొకటి రూపొందించారు. ఈ సిరీస్‍లో ఓలవుమ్ తీరవుమ్ కథలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించగా.. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. శిలైఖితమ్ స్టోరీలో బిజూ మీనన్ మెయిన్ రోల్ చేయగా.. ప్రియదర్శన్ తెరకెక్కించారు. కడుగన్నవ ఒరు యాత్ర భాగంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర చేయగా రంజిత్ అభయం డైరెక్ట్ చేశారు.
తేడీ కథలో సిద్ధిఖీ మెయిన్ పాత్ర పోషిచంగా.. సంతోష్ శివన్ దర్శకత్వం వహించారు. కజ్చా కథలో నరైన్, పార్వతి ప్రధాన పాత్రలు చేయగా.. డైరెక్టర్ శ్యామప్రసాద్ తెరకెక్కించారు. జయరాజ్ దర్శకత్వంలో స్వర్గం తురుక్కున్న సమయం స్టోరీలో ఇంద్రన్స్ మెయిన్ క్యారెక్టర్లో నటించారు. విల్పన స్టోరీలో మధూ, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలు చేయగా.. అశ్వతీ డైరెక్ట్ చేశారు. కడల్ కట్టు కథలో ఇంద్రజీత్ మెయిన్ రోల్ చేయగా..రాజేష్ అంబట్ డైరెక్షన్ చేశారు. షెర్లాక్ అనే కథలో ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించగా.. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇలా.. ఈ సిరీస్‍లో 9 కథలు ఉండగా.. స్టార్ యాక్టర్లు నటించారు. 8 మంది దర్శకులు పని చేశారు. కమల్ హాసన్ కూడా కనిపిస్తారు. ఇక ఈ 9 కథలకు ఓ సంబంధం కూడా ఉంటుంది.
నదియా మౌదు, కైలాష్, నేడుమూడి వేణు, రంజి పనికర్, సురభి లక్ష్మి, సిద్దిఖీ, అపర్ణ బాలమురళి కూడా ఈ సిరీస్‍లో ఉన్నారు. మనోరతంగల్ సిరీస్‍ను విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రోహన్ దీప్ సింగ్, రాజేశ్ కేజ్రీవాల్, జే పాండ్యా సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‍కు షో రన్నర్‌గా ప్రియదర్శన్ వ్యవహరించారు. మొత్తంగా స్టార్ నటీనటులు, 9 విభిన్నమైన కథలు ఉన్న సిరీస్‍ను ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు.
జీ5 ఓటీటీలో ఈవారం బహిష్కరణ అనే తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ జూలై 19న అందుబాటులోకి వస్తుంది.