Ponniyin Selvan 2 - Amazon Prime: నెల కాకముందే ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్ 2 - స్ట్రీమింగ్ ఎందులో అంటే
Ponniyin Selvan 2 - Amazon Prime: మణిరత్నం పొన్నియన్ సెల్వన్ -2 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రెంటల్ విధానంలో రిలీజైన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...
Ponniyin Selvan 2 - Amazon Prime: థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా గడవకముందే మణిరత్నం (Maniratnam) విజువల్ వండర్ పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శుక్రవారం (నేడు)అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ హిస్టారికల్ మూవీ రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో పొన్నియన్ సెల్వన్ -2 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
399 రూపాయల రెంటల్ ఛార్జీలతో శుక్రవారం ఈ మూవీని రిలీజ్ చేశారు. తమిళం, తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో ఈ సినిమాను చూసే వెసులుబాటును కల్పించారు. గత ఏడాది రిలీజైన పొన్నియన్ సెల్వన్‌కు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్(Vikram), ఐశ్వర్యరాయ్ కాంబినేషన్ సీన్స్‌కు ప్రశంసలు దక్కాయి. అలాగే వార్ సీక్వెన్స్‌లతో పాటు, కార్తి, జయం రవి, త్రిష (Trisha) యాక్టింగ్ బాగున్నాయనే కామెంట్స్ వినిపించాయి.
చోళ సామ్రాజ్యానికి ఎదురైన ముప్పును కరికాళచోళుడు, కుందైవి, పొన్నియన్ సెల్వన్ కలిసి ఎలా ఎదుర్కొన్నారన్నది ఈ సీక్వెల్‌లో ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో మణిరత్నం గ్రాండియర్‌గా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు.
నిర్మాతలకు నష్టాలు...
ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతలకు మాత్రం పొన్నియన్ సెల్వన్ 2 నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. పొనియన్ సెల్వన్ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడంలో సీక్వెల్ సక్సెస్ కాలేకపోయింది. తమిళ నేటివిటీకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండటం, కథలో బలమైన సంఘర్షణ పండకపోవడంతోనే పొన్నియన్ సెల్వన్ 2 పరాజయానికి కారణమని క్రిటిక్స్ అంచనా వేస్తోన్నారు.