Amazon Great Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్ నేడు ఆఖరు: ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు-amazon great summer sale ends today check deals on popular smartphones
Telugu News  /  Business  /  Amazon Great Summer Sale Ends Today Check Deals On Popular Smartphones
Amazon Great Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్ నేడు ఆఖరు (Photo: Mint)
Amazon Great Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్ నేడు ఆఖరు (Photo: Mint)

Amazon Great Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్ నేడు ఆఖరు: ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు

08 May 2023, 14:54 ISTChatakonda Krishna Prakash
08 May 2023, 14:54 IST

Amazon Great Summer Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నేడు (మే 8) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ సేల్‍లో ఆఫర్లతో లభిస్తున్న కొన్ని పాపులర్ మొబైళ్లను ఇక్కడ చూడండి.

Amazon Great Summer Sale: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) నిర్వహిస్తున్న గ్రేట్ సమ్మర్ సేల్ (Great Summer Sale) నేడు (మే 8) ముగియనుంది. ఈ నెల 4న ప్రారంభమైన సేల్‍కు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ సేల్‍లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‍టాప్‍లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్‍లతో పాటు దాదాపు అన్ని గాడ్జెట్లు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు లాంటి హోమ్ అప్లియన్సెస్ కూడా ఆఫర్లకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమ్మర్ సేల్‍లో కొన్ని పాపులర్ స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు ఉన్నాయి. అందుకే నేటి (మే 8) అర్ధరాత్రి ఈ సేల్ ముగిసేలోగా ఆ ఆఫర్లపై ఓ లుక్కేయండి. పాపులర్ ఫోన్లపై అమెజాన్ సమ్మర్ సేల్‍లో ఉన్న కొన్ని డీల్స్ ఇవే.

ఐఫోన్ 14

యాపిల్ ఐఫోన్ 14 (128జీబీ) ఈ అమెజాన్ సేల్‍లో 15 శాతం డిస్కౌంట్‍తో రూ.67,999కు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, కొటాక్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. పాత ఫోన్‍ను ఎక్స్చేంజ్ చేసి రూ.19,950 వరకు ఎక్స్చేంజ్ పొందే ఛాన్స్ ఉంది. ఎక్స్చేంజ్ చేసే ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్చేంజ్ విలువ వర్తిస్తుంది.

వన్‍ప్లస్ 11 5జీ

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‍లో వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ మొబైల్ (8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్) రూ.56,999 ధరకు లభిస్తోంది. కొటాక్, ఐసీఐసీఐ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే మరో రూ.1,000 డిస్కౌంట్ దక్కించుకోవచ్చు. ఎక్స్చేంజ్ సదుపాయం కూడా ఉంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ

సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్20 ఎఫ్ఈ 5జీ బేస్ వేరియంట్ అమెజాన్ సేల్‍లో రూ.30,499 ధరకే అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, కొటాక్ బ్యాంక్ కార్డు ఆఫర్ కూడా వినియోగించుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.

ఐకూ నియో 7జీ 5జీ

రీసెంట్‍గా లాంచ్ అయిన ఐకూ నియో 7 5జీ మొబైల్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ డేస్ సేల్‍లో డిస్కౌంట్‍తో రూ.28,999కు లభిస్తోంది. ఐసీఐసీఐ, కొటాక్ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2వేల వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ సదుపాయం ఉంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ

సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ (6జీబీ, 128జీబీ) మొబైల్ ధర అమెజాన్ సేల్‍లో రూ.14,990గా ఉంది. బ్యాంక్ కార్డు ఆఫర్ కింద రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఐకూ జెడ్6 లైట్ 5జీ

ఐకూ జెడ్6 లైట్ 5జీ మొబైల్ (4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) ధర అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‍లో రూ.12,999గా ఉంది. కొటాక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో రూ.1,000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Amazon Great Summer Sale: యాపిల్, వన్‍ప్లస్, సామ్‍సంగ్, షావోమీ, వివో, ఒప్పో, ఐకూ, రియల్‍మీ సహా దాదాపు అన్ని బ్రాండ్‍ల ఫోన్లపై ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‍లో ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లు, స్మార్ట్ వాచ్‍లు, ట్యాబ్లెట్లు సహా అన్ని గాడ్జెట్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. కాగా, నేడు (మే 8) ఈ సేల్ ముగియనుంది.