vikram collections: బాహుబలి, కేజీఎఫ్2 రికార్డులను బ్రేక్ చేసిన విక్రమ్...పదిరోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే...
కమల్‌హాసన్ విక్రమ్ సినిమా వరల్డ్‌వైడ్‌గా అద్వితీయ వసూళ్లను సాధిస్తోంది. తమిళంతో పాటు తెలుగు,మలయాళ భాషల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. లొకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పది రోజుల్లో ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ సాధించిందంటే...
విక్రమ్ సినిమా వసూళ్ల రేసులో దూసుకుపోతున్నది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోతను మోగిస్తోంది. కమల్‌హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లో అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం మూడు వందల కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం పది రోజుల్లోనే విక్రమ్ సినిమా ఈ ఘనతను సాధించడం గమనార్హం.
రజనీకాంత్ నటించిన 2.ఓ, కబాలి, రోబో తర్వాత వరల్డ్ వైడ్‌గా మూడు వందల కోట్ల వసూళ్లను సాధించిన నాలుగో తమిళ సినిమాగా విక్రమ్ నిలిచింది. తమిళనాడులో కలెక్షన్స్ పరంగా రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి 2, కేజీఎఫ్2 రికార్డులను అధిగమిస్తూ 150 కోట్ల వసూళ్లను చేరుకున్నట్లు సమాచారం. కేరళలోనూ విక్రమ్ సినిమాకు 30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ సినిమాగా టాప్ ప్లేస్‌లో నిలిచింది.
ఓవర్‌సీస్‌లో 2.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. బ్లాక్‌స్క్వాడ్ పోలీస్ ఆఫీసర్ గా డిఫరెంట్ క్యారెక్టర్ ను మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పోషించాడు. ముగ్గురి పాత్రలతో పాటు యాక్షన్ సన్నివేశాలు, కథలోని మలుపులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
కమల్‌హాసన్ కెరీర్‌లో ఇదే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ ఫిలిమ్స్ పతాకంపై కమల్‌హాసన్ స్వయంగా నిర్మించారు. ఈ చిత్రానికి కొనసాగింపుతో విక్రమ్ 3 పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్