Ponniyin Selvan 2 Collections: 300 కోట్ల క్లబ్‌లో పొన్నియన్ సెల్వన్ 2 - అయినా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాలేదు
Ponniyin Selvan 2 Collections: మణిరత్నం పొన్నియన్ సెల్వన్ -2 మూవీ మూడు వందల కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది.అయినా ఈ సినిమా ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
Ponniyin Selvan 2 Collections: మణిరత్నం విజువల్ వండర్ పొన్నియన్ సెల్వన్ -2 మూడు వందల కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. 11 రోజుల్లోనే ఈ ఘనతను సాధించింది. ఆదివారం నాటి కలెక్షన్స్‌తో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తమిళనాడులో అత్యధికంగా 125 కోట్లకుపైగా ఈ సినిమా కలెక్షన్స్ సాధించింది.
తెలుగు వెర్షన్ 11 రోజుల్లో దాదాపు 15 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్‌సీస్‌లో మణిరత్నం సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతోన్నారు. ఓవర్‌సీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకు ఈ సినిమా 120 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా మూడు వందల కోట్ల క్లబ్‌లోకి ఎంటరైనా బ్రేక్ ఈవెన్ మాత్రం కాలేదు.
భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 335 కోట్లుగా ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే మరో 35 కోట్లకుపైగా కలెక్షన్స్ రావాల్సి ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. చోళ సామ్రాజ్యంలోని కుట్రలు, కుతంత్రాల నేపథ్యంలో దర్శకుడు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 సినిమాను తెరకెక్కించారు. ఇందులో విక్రమ్, జయంరవి, కార్తి, ఐశ్వర్యరాజ్, త్రిషతో పాటు పలువురు కోలీవుడ్ నటీనటులు కీలక పాత్రలను పోషించారు.
చోళ సామ్రాజ్యాన్ని నిర్మూలించాలని పథకం వేసిన నందినితో పాటు మధురాంతకుడి కుట్రలను చోళ యువరాజులు కరికాలుడు, పొన్నియన్ సెల్వన్‌తో పాటు వందిదేవుడు ఎలా ఎదురించాడన్నది ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో దర్శకుడు మణిరత్నం ఈ సీక్వెల్‌లో చూపించారు.
గ్రాండియర్ విజువల్స్, ప్రధాన పాత్రధారుల నటన పట్ల ప్రశంసలు లభిస్తోన్నాయి. ఈ సీక్వెల్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్‌ను అందించారు. ఈ హిస్టారికల్ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.