Ponniyin Selvan 2 Twitter Review: పొన్నియ‌న్ సెల్వ‌న్ -2 ట్విట్ట‌ర్ రివ్యూ - మ‌ణిర‌త్నం మూవీ బాహుబ‌లిని బీట్ చేసిందా?-maniratnam ponniyin selvan 2 twitter review
Telugu News  /  Entertainment  /  Maniratnam Ponniyin Selvan 2 Twitter Review
పొన్నియ‌న్ సెల్వ‌న్ -2
పొన్నియ‌న్ సెల్వ‌న్ -2

Ponniyin Selvan 2 Twitter Review: పొన్నియ‌న్ సెల్వ‌న్ -2 ట్విట్ట‌ర్ రివ్యూ - మ‌ణిర‌త్నం మూవీ బాహుబ‌లిని బీట్ చేసిందా?

28 April 2023, 10:06 ISTNelki Naresh Kumar
28 April 2023, 10:06 IST

Ponniyin Selvan 2 Twitter Review: మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పీరియాడిక‌ల్ మూవీ పొన్నియ‌న్ సెల్వ‌న్ -2 శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమా ప్రీమియ‌ర్ టాక్ ఎలా ఉందంటే...

Ponniyin Selvan 2 Twitter Review: ఈ ఏడాది ద‌క్షిణాది సినీ ప్రేమికులు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న సీక్వెల్స్‌లో పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 ఒక‌టి. విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సీక్వెల్‌ శుక్ర‌వారం (నేడు) పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైంది. పొన్నియ‌న్ సెల్వ‌న్ 2లో విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి, త్రిష‌, ఐశ్వ‌ర్య‌రాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఫ‌స్ట్ పార్ట్ దాదాపు 500 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ మ్యాజిక్ సీక్వెల్‌తోనూ మ‌ణిర‌త్నం కంటిన్యూ చేశాడా? ఈ సీక్వెల్ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉంది అన్న‌ది చూద్దాం...

మ్యూజిక్‌ ప్ల‌స్‌…

పొన్నియ‌న్ సెల్వ‌న్ -2 ఆరంభంలోనే ప‌దిహేను నిమిషాల పాటు సాగిన ఓపెనింగ్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌ని అభిమానులు చెబుతోన్నారు. క‌రికాల‌న్‌, నందిని మ‌ధ్య డ్రామాను ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఆస‌క్తిక‌రంగా న‌డిపించార‌ని పేర్కొంటున్నారు.

సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ మాత్ర‌మే ఎంగేజింగ్‌గా ఉన్నాయ‌ని, ఓవ‌రాల్‌గా మాత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 యావ‌రేజ్ మూవీ అని కామెంట్స్ వినిపిస్తోన్నాయి. క‌థాగ‌మ‌నం నిదానంగా సాగుతూ బోర్ కొట్టించిద‌ని అంటున్నారు. అయితే ఫ‌స్ట్ పార్ట్ కంటే సీక్వెల్ బెట‌ర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

మ‌ణిర‌త్నం మ్యూజిక్‌, ఆర్ట్ వ‌ర్క్ సినిమాకు పెద్ద ప్ల‌స్‌గా నిలిచాయ‌ని అంటున్నారు. అభిమానులు కోరుకునే ఎలివేష‌న్స్, హీరోయిజం లాంటి హంగులేవి లేకుండా క‌థ‌ను న‌మ్మి ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను మ‌ణిర‌త్నం సింపుల్‌గా డిజైన్ చేశార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతోన్నారు.

ట్విస్ట్‌లు లేవు...

ఎలాంటి ట్విస్ట్‌లో లేకుండా ఫ్లాట్‌గా పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 క‌థ సాగుతుంద‌నిచెబుతున్నారు. సినిమాలో పెద్దగా హై మూవ్‌మెంట్స్ ఉండ‌వ‌ని పేర్కొంటున్నారు. డీసెండ్ పీరియాడిక‌ల్ డ్రామాగా మ‌ణిర‌త్నం ఈ మూవీని రూపొందించాడ‌ని అంటున్నారు.

స్టోరీ, మేకింగ్ ప‌రంగా బాహుబ‌లి కంటే పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 బెట‌ర్ అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తోన్నారు. మ‌రికొంద‌రు మాత్రం బాహుబ‌లిని బీట్ చేసే ద‌మ్ము ఈ సినిమాకు లేదని అంటున్నారు.