Kannappa First Look: మహా శివరాత్రి నాడు మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్.. పవర్‌ఫుల్‌గా పోస్టర్-manchu vishnu kannappa first look released on maha shivaratri festival telugu cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa First Look: మహా శివరాత్రి నాడు మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్.. పవర్‌ఫుల్‌గా పోస్టర్

Kannappa First Look: మహా శివరాత్రి నాడు మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్.. పవర్‌ఫుల్‌గా పోస్టర్

Hari Prasad S HT Telugu
Mar 08, 2024 03:58 PM IST

Kannappa First Look: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కన్నప్ప మూవీ మేకర్స్ మంచు విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ లో విష్ణు లుక్ ఆకట్టుకునేలా ఉంది.

మహా శివరాత్రి నాడు మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్.. పవర్‌ఫుల్‌గా పోస్టర్
మహా శివరాత్రి నాడు మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్.. పవర్‌ఫుల్‌గా పోస్టర్

Kannappa First Look: మహా శివరాత్రినాడు ఆ పరమశివుడి మహా భక్తుడి పేరు మీదుగా వస్తున్న కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంచు విష్ణు ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో విల్లు పట్టుకొని జలపాతం నుంచి బయటకు వస్తూ మంచు విష్ణు కనిపించాడు. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కన్నప్ప ఫస్ట్ లుక్

మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ ఈ మూవీపై విపరీతమైన హైప్ నెలకొంది. మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శివరాత్రి నాడు మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. బ్రేవెస్ట్ వారియర్.. ది అల్టిమేట్ డివోటీ (ఎంతో ధైర్యం కలిగిన యోధుడు.. పరమ భక్తుడు) అనే ట్యాగ్ లైన్ తో ఈ పోస్టర్ తీసుకొచ్చారు.

నిజ జీవిత కథ ఆధారంగా మూవీ తెరకెక్కిస్తున్నట్లు కూడా వెల్లడించారు. కన్నప్ప మూవీ ఓ దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుడి భక్తుడైన కన్నప్ప కథను తెరపైకి తీసుకొస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరిలోనూ స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. విష్ణు మంచు ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నాడు.

తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కన్నప్ప కథను సంపూర్ణంగా చెప్పేస్తోంది. ఈ పోస్టర్ పాత్రలోని ధైర్యం, క్యారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీని చూపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసేలా ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కన్నప్పపై భారీ అంచనాలుండగా.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మరింత బజ్ పెరిగింది. కన్నప్పను తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

కన్నప్ప గురించి..

నిజానికి కన్నప్ప మూవీ నుంచి గతేడాదే మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో విష్ణు ముఖాన్ని రివీల్ చేయలేదు. అందులోనూ అతడు విల్లు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తున్నా.. వెనుక నుంచి చూపించారు. తాజా లుక్ లో విష్ణు ముఖాన్ని చూపించారు.

ఓ నాస్తికుడు శివుడికి ప‌ర‌మ‌భ‌క్తుడిగా ఎలా మారాడ‌ద‌న్న‌ది క‌న్న‌ప్ప సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు మంచు విష్ణు తెలిపాడు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో క‌న్న‌ప్ప మూవీ తెర‌కెక్కిస్తున్నాడు మంచు విష్ణు.

క‌న్న‌ప్ప మూవీకి మంచు విష్ణు ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. చాలా రోజుల క్రిత‌మే ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. అయితే గతేడాది చివర్లో మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. కొన్నాళ్లు న్యూజిలాండ్ లో షూటింగ్ జరిగింది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై విష్ణు భారీ ఆశలే పెట్టుకున్నాడు. తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నాడు.

IPL_Entry_Point