Kannappa Movie Update: కన్నప్ప మూవీపై అప్‍డేట్ ఇచ్చిన మోహన్‍బాబు-kannappa movie new zealand schedule completed mohan babu reveals ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa Movie Update: కన్నప్ప మూవీపై అప్‍డేట్ ఇచ్చిన మోహన్‍బాబు

Kannappa Movie Update: కన్నప్ప మూవీపై అప్‍డేట్ ఇచ్చిన మోహన్‍బాబు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 23, 2023 07:14 PM IST

Kannappa Movie Update: కన్నప్ప సినిమా షూటింగ్ గురించి మోహన్ బాబు అప్‍డేట్ ఇచ్చారు. న్యూజిలాండ్‍లో తొలి షెడ్యూల్ పూర్తయిందని తెలిపారు. అలాగే, మరిన్ని విశేషాలు వెల్లడించారు.

Kannappa Movie Update: కన్నప్ప మూవీపై అప్‍డేట్ ఇచ్చిన మోహన్‍బాబు
Kannappa Movie Update: కన్నప్ప మూవీపై అప్‍డేట్ ఇచ్చిన మోహన్‍బాబు

Kannappa Movie Update: మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. మహా శివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కలెక్షన్ కింగ్, నిర్మాత మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. తాజాగా, కన్నప్ప షూటింగ్ అప్‍డేట్‍ను మోహన్ బాబు వెల్లడించారు.

కన్నప్ప సినిమా షూటింగ్ న్యూజిలాండ్ షెడ్యూల్ ముగిసినట్టు మోహన్ బాబు వెల్లడించారు. ఈ మేరకు నేడు ఓ ట్వీట్ చేశారు. న్యూజిలాండ్‍లో 90 రోజుల పాటు 600 మంది హాలీవుడ్, భారతదేశ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగమైన మొదటి షెడ్యూల్ పూర్తయిందని ట్వీట్ చేశారు. మూవీ యూనిట్ స్వదేశానికి తిరిగి వచ్చేస్తోందని పేర్కొన్నారు.

“న్యూజిలాండ్‍లో 600 మంది హాలీవుడ్, భారతదేశ నటీనటులతో, థాయ్‍లాండ్, న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో.. మంచు విష్ణు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. న్యూజిలాండ్‍లోని అద్భుతమైన లొకేషన్లలో 90 రోజుల మొదటి షెడ్యూల్ పూర్తయింది. పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుడి ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకొని భారత దేశానికి తిరిగి వస్తున్నాం” అని మంచు మోహన్ బాబు నేడు ట్వీట్ చేశారు.

కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పరమ శివుడిగా నటించనున్నారు. పార్వతీ దేవిగా నయనతార కనిపించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రీతీ ముకుందన్ ఈ చిత్రంలో విష్ణు సరసన ఫీమేల్ లీడ్ చేస్తున్నారు.

న్యూజిలాండ్‍లో కన్నప్ప సినిమా షూటింగ్‍లో ఓ దశలో మంచు విష్ణుకు సల్ప గాయమైంది. దీంతో కొన్ని రోజులు ఆయన బ్రేక్ తీసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‍లో పాల్గొన్నారు. ఎట్టకేలకు న్యూజిలాండ్ షూటింగ్ షెడ్యుల్‍ను కన్నప్ప మూవీ పూర్తి చేసుకుంది.

మహాభారతం టీవీ సిరీస్‍‍తో పాపులర్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ కథ, మాటలు అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవసి సంగీతం అందిస్తున్నారు.

IPL_Entry_Point