Avram Manchu: మంచు ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్.. ఆ సినిమాతో తెరంగేట్రం చేయనున్న మంచు విష్ణు కుమారుడు-manchu vishnu son avram manchu ready to debut with kannappa movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avram Manchu: మంచు ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్.. ఆ సినిమాతో తెరంగేట్రం చేయనున్న మంచు విష్ణు కుమారుడు

Avram Manchu: మంచు ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్.. ఆ సినిమాతో తెరంగేట్రం చేయనున్న మంచు విష్ణు కుమారుడు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 05, 2024 02:09 PM IST

Avram Manchu: మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ మంచు తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. కన్నప్ప చిత్రంలో అవ్రామ్ నటించనున్నారు. ఈ విషయాన్ని కన్నప్ప మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

అవ్రామ్‍తో మంచు విష్ణు
అవ్రామ్‍తో మంచు విష్ణు

Avram Manchu: హీరోగా వందలాది సినిమాలు చేసి కలెక్షన్ కింగ్‍గా పేరు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. అనేక సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు కూడా చేసి విలక్షణ నటుడిగానూ పాపులర్ అయ్యారు. మొత్తంగా 500పైగా సినిమాలు చేశారు. ఇంకా నటిస్తున్నారు. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా, కుమార్తె మంచు లక్ష్మి నటిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి మూడో జనరేషన్ కూడా వెండి తెరపై మెరిసేందుకు రెడీ అయింది. మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ మంచు ఐదేళ్ల వయసులోనే తెరంగేట్రం చేయనున్నారు.

అవ్రామ్ మంచు తెరంగేట్రం గురించి మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రంలో బాలనటుడిగా అవ్రామ్ నటించనున్నారు. ఈ మేరకు కన్నప్ప టీమ్ ట్వీట్ చేసింది. మంచు విష్ణు, అవ్రామ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేసి, విషయాన్ని తెలిపింది.

“కొత్త తరం వచ్చేస్తున్న సమయంలో ఊత్సాహం అమితంగా ఉంటుంది. కన్నప్ప చిత్రంతో అవ్రామ్ మంచు.. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మంచు కుటుంబానికి మరో అద్భుతమైన అధ్యాయంగా తరాన్ని ముందుకు తీసుకువెళతాడు” అని కన్నప్ప టీమ్ ట్వీట్ చేసింది.

మహాశివుడి పరమ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా కన్నప్ప సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మోహన్ బాబు. మహాభారతం టీవీ సిరీస్‍తో మంచి పేరు తెచ్చుకున్న హిందీ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్.. కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్‍లో మూవీ రూపొందుతోంది.

కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మహాశివుడిగా కనిపించనున్నారు. పార్వతి దేవిగా నయనతార నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.

కన్నప్ప సినిమాకు ముకేశ్ డైరెక్షన్ చేస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా, పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్ డైలాగ్స్ అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి హిట్ లేని విష్ణు.. కన్నప్పను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే భారీ స్థాయిలో ఈ మూవీని ప్లాన్ చేశారు.

న్యూజిలాండ్‍లో కన్నప్ప మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. ఈ విషయాన్ని మోహన్ బాబు వెల్లడించారు. షూటింగ్ అద్భుతంగా సాగిందని, స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నామంటూ పేర్కొన్నారు. న్యూజిలాండ్‍లో చిత్రీకరణలో మంచు విష్ణుకు ఓ దశలో స్వల్ప గాయమైంది. దీంతో షూటింగ్ కొన్ని రోజులు నిలిచింది. ఆ తర్వాత మళ్లీ షూరూ అయింది.

మొత్తంగా న్యూజిలాండ్‍లో 90 రోజుల పాటు కన్నప్ప షూటింగ్ జరిగింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. మరోవైపు, కన్నప్ప చిత్రం కోసం హాలీవుడ్ టెక్నిషియన్లు కూడా పని చేస్తున్నారని మోహన్ బాబు ఇటీవల పేర్కొన్నారు. సుమారు రూ.100కోట్ల బడ్జెట్‍తో కన్నప్ప చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, బ్రహ్మానందం, ఐశ్వర్య భాస్కరన్ కూడా నటిస్తున్నారని సమాచారం.

IPL_Entry_Point

సంబంధిత కథనం