OTT Romantic Comedy: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-malayalam romantic comedy movie little hearts will be streaming in telugu on aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Comedy: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Romantic Comedy: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Oct 21, 2024 06:26 PM IST

Little Hearts Telugu OTT Streaming Date: మలయాళ మూవీ ‘లిటిల్ హార్ట్స్’ తెలుగు వెర్షన్ వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..

OTT Malayalam Comedy Movie: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Malayalam Comedy Movie: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

షేన్ నిగమ్, మహిమా నంబియార్ హీరోహీరోయిన్లుగా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ ఏడాది జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి ఆంటో జోస్ పెరీరా, అబీ తీసా పౌల్ దర్శకత్వం వహించారు. ఈ మలయాళ మూవీ ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో వస్తోంది. లిటిల్ హార్ట్స్ చిత్రం తెలుగులో ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

స్ట్రీమింగ్ డేట్

లిటిల్ హార్ట్స్ సినిమా తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 24వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ నేడు (అక్టోబర్ 21) వెల్లడించింది. “హృదయాన్ని హత్తుకునే లిటిల్ హార్ట్స్ జర్నీని మిస్ అవొద్దు. ఆహాలో అక్టోబర్ 24 ప్రీమియర్ కానుంది” అని ఆహా ట్వీట్ చేసింది.

మలయాళంలో థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగున్నర నెలల తర్వాత లిటిల్ హార్ట్స్ తెలుగులో వచ్చేస్తోంది. తెలుగు వెర్షన్ నేరుగా ఆహా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 24 నుంచి ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ సినిమా మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.

లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని లవ్ స్టోరీ, కామెడీతో రూపొందించారు డైరెక్టర్లు అబీ త్రీసా పౌల్, ఆంటో జోస్ పెరెరా. ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ స్పందన దక్కింది. ఈ మూవీలో షైన్ టామ్ చాకో, చెంబన్ వినోద్ జోస్, జాఫర్ ఇడుక్కి, బాబురాజ్, రెంజీ పనికర్, మాలా పార్వతి, పార్వతి బాబు, ఐమా రోస్మీ, జాన్ కైప్పల్లిల్ కీలకపాత్రలు పోషించారు.

లిటిల్ హార్ట్స్ మూవీకి కైలాస్ మీనన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సాండ్రా థామస్ ప్రొడక్షన్స్ పతాకంపై సాండ్రా థామస్, విల్సన్ థామస్ నిర్మించారు. తక్కువ బడ్జెట్‍తోనే ఈ మూవీ తెరకెక్కింది.

లిటిల్ హార్ట్స్ స్టోరీలైన్

సిబి (షేన్ నిగమ్), సోష (మహిమా నంబియార్) చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే, పెద్ద వాళ్లకు చెబితే అంగీకరించరేమోనని దాచి పెడుతుంటారు. ఒంటరిగా ఉండే సిబి తండ్రి బేబీ (బాబురాజు).. సిసిలీ (రమ్య సివి)ని ప్రేమిస్తాడు. అయితే, వీరి ప్రేమను సిసిలీ కూతురు వ్యతిరేకిస్తుంది. సిబి, సోష ప్రేమకు కూడా సవాళ్లు ఎదురవుతాయి. మరి ఈ పరిస్థితులను సిబి ఎలా చక్కదిద్దాడు? ఎవరినీ బాధపెట్టకుండా ప్రేమను గెలిపించుకున్నాడా? అతడి తండ్రి ప్రేమ కథ ఏమైంది? అనే విషయాలు లిటిల్ హార్ట్స్ చిత్రంలో ఉంటాయి.

కాగా, ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారమే పాపులర్ టాక్ షో.. అన్‍స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న ఈ షో నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్‍కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిథిగా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఈ ఎపిసోడ్‍పై ఆసక్తి విపరీతంగా ఉంది. అన్‍స్టాపబుల్‍కు చంద్రబాబు రావడం ఇది రెండోసారి.

Whats_app_banner