Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు-mahesh babu namrata ram charan and upasana cast votes in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Chatakonda Krishna Prakash HT Telugu
May 13, 2024 06:17 PM IST

Mahesh Babu, Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‍చరణ్, మహేశ్ బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో లోక్‍సభ ఎన్నికల్లో ఓటేశారు. సింపుల్, స్టైలిష్ లుక్‍తో అదరగొట్టారు.

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు
Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Mahesh Babu - Ram Charan: టాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా మంది నేడు (మే 13) ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ మధ్యాహ్నం తర్వాత ఓటు వేశారు. తెలంగాణలో జరుగుతున్న లోక్‍సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వివరాలివే..

నమ్రతతో కలిసి మహేశ్

ఓటు వేసేందుకు తన భార్య నమత్రా శోరోద్కర్‌తో కలిసి వచ్చారు మహేశ్ బాబు. హైదరాబాద్‍లో జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ స్టేషన్‍లో ఓటు వేశారు. పోలింగ్ స్టేషన్ వద్ద రద్దీ తగ్గాక మధ్యాహ్నం ఓటు వేసేందుకు మహేశ్ వచ్చారు.

సింపుల్‍గా బ్లూ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి లాంగ్ హెయిర్‌తో స్టైలిష్‍గా కనిపించారు మహేశ్ బాబు. క్యాప్ ధరించి కాస్త లుక్ కనిపించకుండా కవర్ చేసినట్టు అనిపించింది. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నారు మహేశ్. ఆ మూవీ కోసం కొత్త లుక్‍కు మారుతున్నారు.

రామ్‍చరణ్ ఇలా..

హైదరాబాద్‍లోని జూబ్లిహిల్స్ క్లబ్ పోలింగ్ స్టేషన్‍లో గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ ఓటు వేశారు. భార్య ఉపాసనతో కలిసి ఆయన వచ్చారు. రామ్‍చరణ్ కారు దిగగానే చాలా మంది చుట్టూ గుమిగూడారు. ఆ తర్వాత పోలింగ్ స్టేషన్‍లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు చరణ్, ఉపాసన. ఆ తర్వాత ఏ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. వైట్ కలర్ ఔట్‍ఫిట్‍లో రామ్‍చరణ్ స్టైలిష్‍గా కనిపించారు. బ్లాక్ కలర్ సన్‍గ్లాసెస్ ధరించారు.

రామ్‍చరణ్ ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ మూవీలో ఐఏఎస్ అధికారిగా ఆయన నటిస్తున్నారు. రాజకీయాలు, ఓట్లు, పరిపాలన చుట్టే ఈ మూవీ స్టోరీ సాగనుంది.

కాగా, మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి సహా చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు నేడు హైదరాబాద్‍లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సినిమాలు ఇలా..

మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. రాజమౌళితో తదుపరి గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ మూవీ (SSMB 29) చేయనున్నారు మహేశ్. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఇప్పిటికే పూర్తయింది. షూటింగ్‍కు ముందు చేయాల్సిన పనుల్లో రాజమౌళి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అలాగే, ఈ మూవీలో కొత్త లుక్‍తో మహేశ్ కనిపించనున్నారు. రాజమౌళితో మూవీ కోసం ప్రత్యేక ఫిజికల్ ట్రైనింగ్ కూడా మహేశ్ పాటిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు లేకపోతే సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు రామ్‍చరణ్. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. దిల్‍రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Whats_app_banner